Thursday, May 16, 2024
- Advertisement -

అమ‌రావ‌తి ఏపీ ప్ర‌జ‌ల‌రాజ‌ధానికాదు..టీడీపీ నేత‌ల రాజ‌ధాని…ప‌వ‌న్‌

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చంద్ర‌బాబునాయుడుపై మ‌రో సారి రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి రాజీపడేలా వ్యవహరించ‌డంతోనే ఏపీకీ అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. విభజన హామీల విషయంలో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయలేదని గుర్తుచేశారు.

వామపక్ష నేతలతో భేటీ అయిన ప‌వ‌న్ విభ‌జ‌న‌హామీలు, ప్ర‌త్యేక‌హోదాపై ఎలా ముందుకెల్లాల‌నే దానిపై చ‌ర్చించారు. అమరావతి టిడిపి రాజధానిలాగుందే కానీ ఏపి రాజధాని లాగ లేదంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి, ప్రజారోగ్యంపై ఖర్చు చేయాల్సిన నిధులను తన ఇష్టారాజ్యంగా పుష్కరాల తదితారల కోసం ఖర్చు చేయటం వల్లే జనాలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు.

రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల‌ను భాజాపా, టీడీపీ గాలికొదిలేశాయ‌ని విమ‌ర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయని పవన్‌ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -