Tuesday, May 14, 2024
- Advertisement -

మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు షాక్ ఇచ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌…

- Advertisement -

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం ప‌వ‌న్ ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారు. పార్టీని ప‌టిష్టం చేసె ప‌నిలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం న‌లుగురి స‌భ్యుల‌తో పోలిట్ బ్యూరో.. 11 మంది స‌భ్యుల‌తో పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీని ఏర్పాటు చేసారు ప‌వ‌న్‌. పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను నియ‌మించ‌గా.. క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్‌గా మాదాసు గంగాధ‌రం నియ‌మితు ల‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు నాగబాబు సైతం పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌భ్యుడుగా నియ‌మితుల‌య్యారు. ఇద‌లా ఉంటె మాజీ జేడీ ల‌క్ష్మీనార‌యాణ‌కు మాత్రం రెండు క‌మిటీల్లోను చోట క‌ల్పించ‌లేదు.

గ‌త కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌కుండా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రెండు క‌మిటీల్లోను చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో ఆయ‌న పార్టీని వేడ‌నున్నార‌నె ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వ‌స్తుండ‌టంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించేందుకు వీలుగా ఈ క‌మిటీల‌ను ఏర్పాటు చేసారు.

జ‌న‌సేన పొలీట్ బ్యూరో

  1. నాదెండ్ల మ‌నోహ‌ర్‌
  2. పి. రామ్మోహ‌న్ రావు
  3. రాజు రవితేజ్
  4. అర్హంఖాన్

జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్: నాదెండ్ల మనోహర్

సభ్యులు

  1. తోట చంద్రశేఖర్
  2. రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు)
  3. కొణిదెల నాగబాబు
  4. కందుల దుర్గేష్
  5. కోన తాతారావు
  6. ముత్తా శశిధర్
  7. పాలవలస యశస్విని
  8. డా.పసుపులేటి హరిప్రసాద్
  9. మనుక్రాంత్ రెడ్డి
  10. ఎ.భరత్ భూషణ్
  11. బి.నాయకర్

క్రమశిక్షణ సంఘం చైర్మన్: మాదాసు గంగాధరంను ప‌వ‌న్ నియ‌మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -