Saturday, April 20, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు గుడ్ బాయ్‌.. చిరు చూపు వైసీపీవైపు..?

- Advertisement -

సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతూనే పార్టీలు పొత్తుల ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు శ్రేణుల‌కు బాబు పంపారు. అయితే ఇప్పుడు తాజాగా జ‌న‌సేన‌-వైసీపీ పొత్తు రారాష్ట్ర‌ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. గ‌త కొద్ది రోజులుగా ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటుంద‌నేే వార్త‌ల‌ను పార్టీల నేత‌లు ఖండించారు.

ప‌వ‌న్‌, జ‌గ‌న్‌ను క‌లిపేందుకు ఏకంగా చిరునే రంగంలోకి దిగార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. దీనికి బ‌లం చేకూర్చే విధంగా జగన్, చిరంజీవి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషియ‌ల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితమే జగన్ ని చిరంజీవి కలిశారంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే వీరి భేటీ నిజం అయితే దాని వెనుక భారీ వ్యూహ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. పోల్ మేనేజ్ మెంట్‌లో బాబు దిట్ట అన్న విష‌యం జ‌గ‌ మెరిగిన సత్యం. ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చించ‌డంలో బాబు స్టైలే వేరు. అలాంటి బాబును ఎదుర్కోవాలంటే జ‌గ‌న్‌, ప‌వ‌న్‌లు ఒక్క‌టి కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని రాజ‌కీయ పండితులు అంటున్నారు. ఒకవేళ ఎవరికి వారు అన్నట్లుగా పోటీ చేస్తే చంద్రబాబు లాభ‌ పడ‌తారనడంలో సందేహం లేదు.

ఇటీ వ‌లే వైసీపీ, జ‌న‌సేన నేతేల భేటీలో పొత్తు, సీట్ల విష‌యంలో సంప్ర‌దింపులు జ‌రిపార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. భేటీలో జనసేన 45 అసెంబ్లీ స్థానాలను 8 పార్లమెంట్ స్థానాలను ఇవ్వాలంటూ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రహస్యంగా కలుసుకుంది వాస్తవం కాదా అంటూ మంత్రి క‌ళా వెంక‌ట్రావ్ ప్ర‌శ్నించారు.

ఇటివల కాలంలో జగన్, పవన్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. జగన్ మగతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమేనా మగతనమా.. అంటూ జగన్ కూడా ఘాటుగానే స్పందించారు.

ఇద్దరు నేతలు ఇగోలకు పోతున్నారని గమనించిన చిరంజీవి ఇక నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి మాటంటే పవన్ కళ్యాణ్ కు వేదవాక్కు. అటు జగన్ తో కూడా చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి పలుమార్లు వైఎస్ జగన్ ను కలిశారు. లండన్ పర్యటనలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలిశారు. ఆ తర్వాత ఇటీవలే వైఎస్ జగన్ పై దాడి ఘటనపై కూడా చిరు స్పందించారు.

జనాలకు సేవ చెయ్యాలంటూ ఎంతో కసితో రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ కు జగన్ తోడైతే రాష్ట్రం మ‌రింత ముందుకు వెల్తుంద‌ని చిరు ఆలోచిస్తున్నారంట‌. ఇద్ద‌రు క‌ల‌సిపోతే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వారికి తిరుగుండ‌ద‌నేది చిరు అభిప్రాయం. రెండు రోజుల క్రితం లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. మ‌రో వైపు ఏపీలో బాబుకు చెక్ పెట్టేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌లు కూడా జగన్, పవన్ ను కలిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

మెుత్తానికి అటు ఆంధ్రప్రదేశ్ లో జనసేన, వైసీపీలు ఏకం అయితే కొన్ని జిల్లాలలో క్లీన్ స్వీప్ అవ‌డం ఖాయం. ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్ద‌రి నేత‌ల‌ను క‌లిపేందుకు చిరు ప్ర‌య‌త్నం ఎంత‌మేర‌కు దోహాద ప‌డుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -