Friday, April 19, 2024
- Advertisement -

ఫిరాయింపుల‌పై స్పిందించిన మంత్రి

- Advertisement -

ఏపీలో రెండు విష‌యాలు రాజ‌కీయ వేడిన పుట్టిస్తున్నాయి. ఒక‌టి నంద్యాల ఉప ఎన్నిక కాగా రెండోది పార్టీ ఫిరాయింపుల వ్య‌వ‌హారం. ఇన్నాల్లు సైలెంట్‌గా వ్య‌హారం ఇప్పుడు హైకోర్టు జోక్యంతో ర‌స‌కందాయంలో ప‌డింది. తాజాగా పార్టీ పిరాయించి మంత్రి ప‌ద‌వులు పొందిన న‌లుగురికి నోటీసుల‌ను జారీ చేసిన హైకోర్టు నాలుగు వారాల గ‌డువు ఇచ్చింది.
ఫిరాయింపు మంత్రులు రాజీనామాలు చేసేందుకు సాహసిస్తారా? ఫిరాయింపులపై సమాధానాలు చెప్పాలంటూ నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే . అదే విషయమై ఫిరాయింపు మంత్రి అఖిలప్రియ నంద్యాలలో ఈరోజు మాట్లాడుతూ, కోర్టు నోటీసులు తమకు ఇంకా అందలేదన్నారు. నోటీసులు అందుకోగానే చంద్రబాబునాయుడుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఏ పిరాయింపుల‌పై ఏ నిర్ణయ‌మైనా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అఖిల చెప్పటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే, తమకు ప్రజా మద్దతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్నది అఖిల వాదన. అఖిల వాదన బాగనే ఉంది కానీ రాజీనామాలకు చంద్రబాబు అంగీకరించొద్దూ? రాజీనామాలు చేసిన తర్వాత మళ్ళీ గెలుస్తామన్న నమ్మకమే ఉంటే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు ఆగుతారు? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మిగిలింది.
అఖిల ఎటువంటి నిర్ణయానికైనా రెడీ అంటోంది కానీ మిగిలిన ముగ్గురి పరిస్ధితేంటట? పార్టీ మారటం తప్పని అంగీకరిస్తూనే రాజీనామా చేయాల్సిన పరిస్ధితిలు ఇపుడు లేవని సుజయకృష్ణ రంగారావు చెబుతుండటం విడ్డూరం. అంటే మిగిలిన మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరానధరెడ్డిలు కూడా చంద్రబాబు నిర్ణయం మేరకు నడుచుకుంటామని మాత్రమే చెబుతు
నంద్యాల ఉపఎన్నిక స‌మ‌యంలోనె హైకోర్టు నోటీసులు జారీ చేయ‌డం కొంత‌వ‌ర‌కు ఇబ్బందిగానె ఉంటుంది.ఉప ఎన్నిక జ‌రుగుతుండేది ఫిరాయింపు ఎంఎల్ఏ నియోజకవర్గమే కదా. దీని ఫలితంతో ఫిరాయింపు మంత్రుల భవిష్యత్తేమిటో తేలిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -