Monday, May 6, 2024
- Advertisement -

జగన్ సై అంటే 10 మంది టీడీపీ ఎమ్మేల్యేలు వైసీపీలోకి …

- Advertisement -

టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఫైర్ అయ్యారు టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. జగన్ పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు.ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదని విమర్శించారు.ముఖ్యమంత్రి జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఐదేళ్ల అరాకచం, దోపిడీని చూడలేక ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే అన్నారు..ఐదేళ్లుగా వనరులను మీరు దోచుకోలేదా అని ప్రశ్నించారు.ప్రజలు గూబ గుయ్యమనేలా తీర్పు ఇచ్చినా టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు.

గతంలో విశాఖలో భూ కబ్జాలు చేసింది అయ్యన్న సహచరులేనని .. అప్పుడు సాక్షాత్తూ మంత్రిగా ఉన్న ఆయనే వెళ్లి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.ఇసుక, నీరు-చెట్టు, భూముల దోపిడీలు టీడీపీ హయాంలోనే జరిగాయని.. రాష్ట్ర ప్రభుత్వం 4లక్షలమందికి ఉద్యోగాలు ఇవ్వడం రౌడీయిజమా అంటూ ప్రశ్నించారు.

ఇసుక, నీరు-చెట్టు, భూముల దోపిడీలు టీడీపీ హయాంలోనే జరిగాయని.. రాష్ట్ర ప్రభుత్వం 4లక్షలమందికి ఉద్యోగాలు ఇవ్వడం రౌడీయిజమా అంటూ ప్రశ్నించారు.సీఎం జగన్ కూడా అసెంబ్లీలోనే టీడీపీ సింబల్ మీద గెలిచిన ఎవర్నీ తీసుకోమని చెప్పారని గుర్తు చేశారు. కాబట్టే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉందని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ నుంచి 10మందికిపైగా ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలను కాపాడుకోలేని నేతలు చేతగాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -