Monday, May 13, 2024
- Advertisement -

మోడీ ఈ సారైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా ?

- Advertisement -

వచ్చే బుధవారం నుంచీ ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రాకు జరిగిన అన్యాయం, ప్రత్యేకహోదా మోసంపై తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని దేశంలోని అన్ని పార్టీలను కోరుతున్నారు. అయితే గతంలో కూడా ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తూ, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను మోడీ సర్కార్ లెక్క చేయలేదు. సభ ఆర్డరులో లేదంటూ కుంటిసాకులు చెబుతూ గత 12 రోజులుగా, రోజుకు కేవలం పది నిముషాలు మాత్రమే సభను నడుపుతూ, వాయిదాలు వేసుకుంటూ వచ్చిన కేంద్రం, చివరకు అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టకుండానే సభను నిరవధిక వాయిదా వేసింది. అవిశ్వాస తీర్మానంపై భయంతో ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం దేశ చరిత్రకే కాదు, ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. బీజేపీకి సొంతంగానే అఖండ మెజార్టీ ఉండికూడా అవిశ్వాస తీర్మానంపై చర్చకు భయపడి సభ నుంచి పారిపోయింది. అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టకుంటే అప్రతిష్ఠను మూటగట్టుకుంటామని తెలిసినా మోడీ ప్రభుత్వం సిగ్గువిడిచి పరారయ్యింది.

అయితే మోడీ నిరంకుశ ధోరణిపై బీజేపీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందని, అవిశ్వాస తీర్మానం పై చర్చ చేపడితే ఆ వర్గం మోడీకి వ్యతిరేకంగా ఓటు వేస్తుందనే భయంతోనే మోడీ, అమిత్ షా అందుకు అవకాశమివ్వకూడదనే చర్చ చేపట్టలేదనే వార్తలు వచ్చాయి. ఎన్డీఏ కూటమితో పాటు బీజేపీలో ఉన్న అగ్రనేతలు, ఇతర పార్టీలతో చంద్రబాబు జరిపిన చర్చల ప్రభావం వల్ల, మోడీపైకి సొంత పార్టీ నుంచే వ్యతిరేక పవనాలు వీస్తాయనే భయంతోనే చర్చ జరపలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. బీజేపీ సీనియర్లను అవమానించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములను పట్టించుకోకపోవడంతో మోడీ, అమిత్ షా పై తీవ్ర అసంతృప్తి పెరిగింది. అందువల్లే వాళ్లు వ్యతిరేకంగా ఓటు వస్తే మోడీ ప్రభుత్వం కూలిపోకపోయినా, ఓ పది ఓట్లు వ్యతిరేకంగా పడినా పరువు తక్కువే. నైతికంగా ఓడిపోయినట్లే, ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రం ఇచ్చి, వారి ఆత్మస్థైర్యాన్ని పెంచినట్లే. ఆ భయంతోనే మోడీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశమివ్వలేదని ఢిల్లీ పొలిటకల్ సర్కిల్స్ లో బాగా చర్చ నడిచింది. మరి ఈ వర్షాకాల సమావేశాల్లో పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై అయినా చర్చకు మోడీ సిద్ధ పడతారో ? మళ్లీ తోక ముడిచి పారిపోతారో ? మళ్లీ పారిపోతే పూర్తి మెజార్టీ ఉన్నా కచ్చితంగా మోడీ, షా భయపడుతున్నట్లే లెక్క. లేదా చర్చిస్తే అందరి అనుమానాలు, భయాలు పటాపంచలైపోతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -