- Advertisement -

వైసీపీలోకి వెల్లాల‌నుకున్న ఆనంకు జ‌గ‌న్ షాక్ ఇస్తాడా..?

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డ్డారు. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి షీటు ఎవ‌ర‌కి కేటాయించాల‌నేదానిపై జ‌గ‌న్ సందిగ్ధంలో ప‌డ్డారు. తాజ‌గా ఏపీ మాజీ సీఎం నేదరుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఆసక్తిదాయకంగా మారింది.

అస‌లు విష‌యానికి వ‌స్తే టీడీపీనేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరేందుకు కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. తాను పోటీచేయాలనుకున్న నియోజకవర్గం కన్ ఫామ్ అయితే.. వెంటనే పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారు. కానీ.. ఇంతలోనే ఆనంకి దిమ్మతిరిగే షాక్ తగిలింది.

బిజేపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారనే వార్తలు వినపడుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు ఆయనకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా కట్టబెట్టారు. అయితే.. ఆ పదవిని ఖాతరు చేయకుండా నేదురుమల్లి వైసీపీలో చేరేందుకే సిద్ధమయ్యారు.

తూర్పుగోదావిరి జిల్లా పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గన్‌ను క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దాదాపు 20 నిమిషాలపాటు చర్చించారు. ఇక రేపో మాపో పార్టీలో చేరడమే తరువాయి. అయితే.. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. ఏ నియోజకవర్గం కోసం అయితే.. ఆనం ఎదురు చూస్తున్నాడో.. అదే నియోజకవర్గం సీటుని నేదురుమల్లికి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది. అదే నిజం అయితే.. ఆనం రామనారాయణ రెడ్డికి షాక్ తగిలినట్టే. వీరిద్దరిలో జగన్ ఎవరికి ప్రాధాన్యతను ఇస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటగిరి సీటు తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై జగన్ ఆచితూచి స్పందించవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీ కొట్టగలిగే వారికి ఛాన్స్ ఇవ్వవచ్చు. అక్కడ పార్టీలో చేరకముందే చేదు అనుభవం ఎదురైంది. మరి ఆనం నెక్ట్స్ స్టెప్ ఏం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -