- Advertisement -

కేసీఆర్‌, బాబుపాల‌న‌కు మార్కులు చేసిన ప‌వ‌న్

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబును జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ మ‌రో సారి టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు కురిపించారు. ప్ర‌భుత్వంలో ఎక్క‌డెక్క‌డ అవినీతి జ‌రుగుతుందో బాబుకు తెలుస‌న‌ని చెప్పారు. చంద్రబాబు సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, కొందరు నేతలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై తనతో చెప్పారని తెలిపారు.

ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతిని బాబు దృష్టికి తీసుకెల్లినా ప‌ట్టించుకోలేద‌న్నారు. ప‌రిపాల‌నా ప‌రంగా చంద్ర‌బాబు పాల‌కు ప‌దిమార్కుల‌కు 2.5 మార్కులు, కేసీఆర్ పాల‌న‌కు 6 మార్కులు వేశారు.

ప్రత్యేక హోదా అంశంపైనా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా అనేది పార్టీల నుంచి వస్తున్న డిమాండ్ అని… ప్రజల్లో ఎలాంటి పట్టింపు లేదని వ్యాఖ్యానించారట. హోదా అయినా…. ప్యాకేజైనా ఏపీకి నిధులు రావడం ముఖ్యమని అభిప్రాయపడ్డారట. ఇక థర్డ్‌ ఫ్రంట్‌పై మాట్లాడేందుకు పవన్ నిరాకరించారట. మోదీతో సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవమేననని… అయితే బీజేపీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పుకొచ్చారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -