Sunday, May 12, 2024
- Advertisement -

నంద్యాల‌పై డీల్ ఇంకా కుద‌ర‌న‌ట్టే…?

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక రాస్ట్ర వ్యాప్తంగా పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. గెలుపు కోసం వైసీపీ,టీడీపీ వ్యూహాలు.. ప్ర‌తి వ్యూహాల‌తో నంద్యాల ఎన్నిక‌ల వాతావ‌ర‌నం వేడెక్కింది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు రెండు సార్లు,లోకేష్ ఒక సారి ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు అంతా అక్క‌డే మ‌కాం వేసి ఎన్నిక‌ల ప్ర‌చారం స‌ర‌లిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే ఇదంతా బాగానె ఉన్నా ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎందుకు స్పందించ‌లేద‌నె వార్త‌లు బ‌లంగా వినిపించాయి. అభ్య‌ర్తిని పోటీకి నిల‌బెడ‌తారా లేకా మ‌ద్ద‌తు ఇస్తారా అస‌లు అత‌ని స్టాండ్ ఏంట‌నేది ప్ర‌శ్న‌గా మారింది.
అయితే ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ నంద్యాల ఉప ఎన్నిక‌పై స్పందించారు. తన వైఖరి జనసేన వైఖరి రెండురోజులో ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్ చెప్పారు. నంద్యాల ఎన్నికల మీద ఆయన స్పందించడం ఇదేప్రథమం. ప్రత్యేక పరిస్థితుల్లో నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్నదని అంటూ ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై మరో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని చెప్పారు.
చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీతో క‌థ మామూలుగామొద‌టి కొచ్చింది. ఇద్ద‌రూ ఒక‌టేనే వాద‌న తేలిపోయింది.ఇక జేసీ వ్యాఖ్య‌లు కూడా ఇందుకు నిద‌ర్శ‌నం.ఇద్ద‌రూ భాయీ…భాయీ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయుకుండా ఎన్నిక‌ల్లో స‌పోర్ట్ చేసెందుకు డీల్ కుదిరిందంటున్నారు.ఇక నంద్యాల ఉప ఎన్నిక‌పై డీల్ కుద‌ర‌నందునే వాయిదా వేస్తున్నార‌నె వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=v8ed1s5VycM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -