Sunday, May 5, 2024
- Advertisement -

సెంటిమెంటుతోనే పార్టీని బలోపేతం చేయాలనె… పీకె ప్లాన్ వ‌ర్క్‌పుట్ అవుతుందా

- Advertisement -

2019 ఎన్నిక‌ల వైసీపీ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను ఏరికోరి జ‌గ‌న్ తెచ్చుకున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీకి ప్ర‌తికూల ప్ర‌భావ‌మే త‌ప్ప బూష్ట్ ఇవ్వ‌లేదు. నంద్యాల ఉపఎన్నికలో పీకే తెర వెనుక వ్యూహాలు ఆ పార్టీకి విజయాన్ని ఖాయం చేస్తాయని చాలామంది భావించారు. కానీ ఫలితం పూర్తిగా బెడిసికొట్టడంతో ఆయన సామర్థ్యంపై లేని పోని విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల‌నుంచి వ‌చ్చాయి. ఇలాంటి తరుణంలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం పీకేకు అనివార్యమైంది.

పార్టీ కార్య‌క్ర‌మాల విష‌యంలో పీకేకు జ‌గ‌న్ పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ నాయ‌కుల‌లో మ‌రో ఆందోళ‌న మొద‌ల‌య్యింది. పార్టీలోని కీలక నాయకులు, ముఖ్య కార్యకర్తలపై పీకె నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కుటుంబ కార్యక్రమాన్ని జనంలోకి వాళ్లు తీసుకెళ్లే తీరు, ప్రజలతో వాళ్లు ఎలా మసులుకుంటున్నారు? వంటి విషయాలన్ని గమనించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని పీకె ఏర్పాటు చేశారనె వార్త‌లు పార్టీ నాయ‌కుల‌నుంచి వినిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మ‌మే కాకుండా వచ్చే ఎన్నికల వరకు ఈ టీమ్ నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు పీకెకు రిపోర్టులు పంపిస్తుందని చెబుతున్నారు. ఆ రిపోర్టులను పీకె జగన్‌కు అందిస్తారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నవారి మీద ఇలా నిఘాలు పెట్టడమేంటని సొంతగూటి నుంచి ప్రశ్నలు తలెత్తుతుండటం వైసీపీకి కొత్త తలనొప్పిగా మారిందంటున్నారు. పీకె ఇచ్చే నివేదికలపై నమ్మకం లేకనే వారు ఈ కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పీకె కొత్త ప్లాన్ కూడా వైసీపీకే చేటు చేస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అధినేతకు తమకు మధ్య పీకె రాయబారాన్ని వారు ఏమాత్రం సహించడం లేదని తెలుస్తోంది. ఏదైనా ఉంటే.. అధినేతే తమతో నేరుగా తేల్చుకోవాలని, పీకె పనితీరు, సామర్థ్యంపై తమకు నమ్మకం లేదని వైసీపీ నేతలు వాపోతున్నట్లు సమాచారం.

సెంటిమెంటుతో వైఎస్ అభిమానులను పార్టీ గొడుగు కిందకు తీసుకురావాలన్న ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. పార్టీ బలోపేతానికి కేవలం వారినే నమ్ముకోవడం కూడా సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకును గురిపెడితే తప్ప వైసీపీ విజయావకాశాలు మెరుగుపడవనే వాదన వినిపిస్తోంది. అయితే తాజాగా చేపట్టిన వైయస్సార్ కుటుంబం కార్యక్రమం పట్ల పీకె కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. పీకె నమ్ముతున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా వైసీపీకి జనం మద్దతు పెరిగితే పార్టీలోను అతని పట్ల విశ్వాసం పెరుగుతుంది.

దీని ద్వారా అసంతృప్తులకు కూడా చెక్ పెట్టవచ్చు. కానీ ఇక్కడ పీకె సక్సెస్ అవుతారా? లేరా? అన్నదే పెద్ద ప్రశ్న. మరోవైపు ఇప్పటిదాకా తనని తాను ప్రూవ్ చేసుకోలేకపోయిన పీకె.. ఇకముందైనా విమర్శలకు చెక్ పెడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కాకినాడ‌, నంద్యాల కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సాకులు చెప్పుకోవచ్చు కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తాడో పేడో తేల్చుకోక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -