Friday, April 26, 2024
- Advertisement -

రఘురామకృష్ణరాజుకు బెయిలా? జైలా?

- Advertisement -

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ను హైదరాబాదులోని తన నివాసంలో 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు గుంటూరులోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో రఘురామకృష్ణరాజు హాజరుపరిచారు. పోలీసులు తన కాళ్లు వాచిపోయేలా కొట్టారని.. రాత్రంతా వేధింపులకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. రఘురామ కృష్ణంరాజు ఒంటిపై గాయాలు ఉన్న పోటోలను తన తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు జైలులో ప్రాణ హాని ఉందని ఆయన తరపున న్యాయవాది వాదించారు.

కోర్టు అవి నిజంగా పోలీసులు కొట్టినవా లేక ఇతర గాయాలా అనేది ముగ్గురితో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన సీఐడీ కోర్టు. 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే రఘురామకృష్ణంరాజు చూపించిన అరికాలు గాయాలు.. గాయాలు కావని జీజీహెచ్‌ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. అతని రెండుకాళ్లకి ఎడీమా ఉందని.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లేదా నిలబడ్డం వల్ల రెండు కాళ్లపాదాల రంగు మారి ఉండొచ్చని పేర్కొన్నారు.. రఘురామకృష్ణరాజు శరీరంపైన ఎలాంటి గాయాలూ లేవని.. ఆయన పాదాల రంగు మారడానికి కారణం ఎవరో కొట్టడం వల్లకాదని స్పస్టంచేసింది.

Also Read: ఒక్క విజయం కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు వీళ్ళే!

అయితే రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించమని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌ మిలిటరీ ఆసుపత్రికి రఘురామను సోమవారం రాత్రి 11 గంటలకు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించారు. రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల నివేదిక సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు అందించారు.

ఇది ఇలా ఉండగా తన తండ్రి రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు భరత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు బెయిల్ పిటిషన్‌ కొట్టివేయాలని, పోలీసు కస్టడీకి అప్పగించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఈరోజు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు బెయిలా? జైలా? వేచి చూడాలి.

Also Read: బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -