Wednesday, May 15, 2024
- Advertisement -

ఎపిపై రాహుల్ గాంధీ సర్వే….చంద్రబాబుకు దిమ్మతిరిగే రిజల్ట్…. జగన్‌కి బిగ్గెస్ట్ బూస్ట్

- Advertisement -

అధికారంలో ఉన్నాడన్న మాటే కానీ చంద్రబాబుకు కనీస స్థాయిలో కూడా ఆనందం కూడా లేకుండా పోతోంది. తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాన్…..కెసీఆర్‌తో కూడా కమిట్ అయ్యి ఇద్దరు చంద్రుల భజనతో కామెడీ పొలిటీషియన్ అనిపించుకోవడంతో 2019ఎన్నికల కోసం రచించిన ఒక వ్యూహం కచ్చితంగా ఫెయిల్ అయ్యేలానే కనిపిస్తుంది. అలాగే నరేంద్ర మోడీ నుంచి కూడా ఏ సపోర్టూ ఉండే అవకాశం కనిపించడం లేదు. గ్రాఫిక్స్ బొమ్మలు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాబు చేసింది ఏమీ లేదన్న విషయం ఎపి ప్రజలకు అర్థమైపోయింది. మరో వైపు పాదయాత్ర చేస్తున్న జగన్ రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటూ ఉన్నాడు. చంద్రబాబు చేతకానితనాన్ని ప్రజలకు సమర్థవంతంగా వివరిస్తున్నాడు. నిజానికి జగన్ చెప్పినదానికంటే కూడా కేంద్రం ఏమీ చేయడం లేదు అని విమర్శించే ప్రాసెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ అథోగతిలో ఉందని చంద్రబాబే స్వయంగా ఒప్పుకోవడం కొంపముంచింది. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు, దేశంలోనే అత్యధిక స్థాయిలో అభివృద్ధి అని మూడేళ్ళుగా ప్రచారం చేసుకున్న చంద్రబాబే……రాష్ట్రం మరీ అథోగతిలో ఉందని లెక్కలతో సహా వివరించడంతో చంద్రబాబు చెప్పిన అభివృద్ధి అంతా డొల్లేనా అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది.

ఆ ప్రభావం మొత్తం ఇప్పుడు సర్వేల్లో కనిపిస్తోంది. సీ ఓటర్ సర్వేలో జగన్‌దే ఆధిక్యం అని తేలిపోయింది. చంద్రబాబుకు కాస్త సన్నిహితంగా ఉండే లగడపాటి రాజగోపాల్ సర్వే అయితే టిడిపికి ఘోర ఓటమి తప్పదని తేల్చేసింది. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ సర్వే ఫలితం కూడా జగన్‌కే అధికారం అని వచ్చిందని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా ఈ విషయమే చర్చించుకుంటున్నారు. 2019నాటికి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయి? కాంగ్రెస్‌కి పది సీట్లు అయినా వస్తాయా? టిడిపి-వైసీపీలలో అధికారం ఎవరికి దక్కొచ్చు అన్న అంచనా కోసం రాహుల్ గాంధీ చేయించిన సర్వేలో కూడా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అని తేలిపోయింది. అలాగే కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేల్చేసింది ఈ సర్వే. 175సీట్లు ఉన్న ఎపి అసెంబ్లీలో వైకాపా 110 సీట్లలో విజయం సాధించడం ఖాయం అని రాహుల్ గాంధీ సర్వేలో తేలింది. టిడిపికి 55 సీట్లు వస్తాయి. మిగతా సీట్లలో జనసేన, బిజెపి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. చంద్రబాబు పచ్చ మీడియాతో చేయించుకుంటున్న సర్వేల్లో కూడా వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయి. ఆ మధ్య ఓ సారి స్వయంగా చంద్రబాబే 55స్థానాల్లో టిడిపికి చాలా కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక సీ ఓటర్ లాంటి సర్వేలతో సహా అన్ని సర్వేల్లోనూ వైఎస్ జగన్ అధికారంలోకి రాావడం ఖాయం అన్న ఫలితాలే వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -