Monday, April 29, 2024
- Advertisement -

తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు వెనకడుగుకు కారణం ఏంటి..?

- Advertisement -

చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు.. నలభై ఏళ్లుగా రాజకీయం లో ఉండి చంద్రబాబు  కు ఏమాత్రం కూడా తెలియకపోతే ఎలా.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయన చెరగని ముద్ర వేస్తున్నారు.. ఇక ఇప్పుడు జగన్ ను విమర్శించడంలోనూ చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు.. గతంలో ప్రజలకు చేయని సేవనంత ఇప్పుడు జగన్ విమర్శించడం పై పెడుతున్నారు.. ఇక ఆంద్రప్రదేశ్ లో తిరుపతి  పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ లు అక్కడ పాగా వేయాలని చూస్తుండగా టీడీపీ మాత్రం అక్కడ పోటీ చేయకూడదని దాదాపుగా నిర్ణయించుకున్నట్లుంది.

 సిట్టింగ్ ఎంపీ మరణించడంతో పాటు, ఆయనకు ఎక్కువగా టీడీపీతో అనుబంధం ఉండటంతో చంద్రబాబు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సీనియర్ నేతలతో చర్చించి పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. అంతేకాకుండా ఇక్కడ ఇతర పార్టీ ల అభ్యర్థులను చూసి తాను నిర్ణయించుకునే అవకాశం కూడా ఉందట..  అందులోనూ అమరావతి కి సపోర్ట్ చేయడం కూడా టీడీపీ కి ఇక్కడ పెద్ద మైనస్ గా ఏర్పడే అవకాశం ఉందట..

ఈ నేపథ్యంలో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై సర్వ్ చేయించాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నారట.. అయితే ఎక్కువగా  పోటీ చేయకకపోవడానికి బలమైన కారణం ఉందని నేతలకు చెబుతున్నారు.బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం, ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని, భయపడి వెనక్కు తగ్గారంటారని కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే నియోజకవర్గంలో పూర్తి స్థాయి సర్వే జరిపిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.  మరి ఆ సర్వ్ లో ఏం తేలుతుందో చూద్దాం మరీ..

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండను గాక ఉండదు..?

అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.?

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

చంద్రబాబు డ్రామాలకు హద్దులు లేవా.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -