Saturday, April 27, 2024
- Advertisement -

అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.?

- Advertisement -

వినుగొండలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోరు ఎంతో ఆసక్తి కరంగా ఉంది..వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ ఇద్దరి నేతల మధ్య ఫైట్ రోజు రోజు కి ముదురిపోతుంది. ఒకరినొకరు మితిమీరి విమర్శించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం ఎక్కడిదాకా వెళ్తుందో అర్థం కానీ స్థితిలో నెట్టేసింది.. ఇద్దరు ఎత్తులు పై ఎత్తులతో నియోజకవర్గంలోని రాజకీయాలను ఎంతో ఆసక్తికరంగా మారుస్తున్నాయి..

ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గత రెండు సార్లు టీడీపీ తరపున విజయం సాధించిన అయన మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూశారు కానీ బొల్లా బ్రహ్మనాయుడు  అయన గెలుపు కు అడ్డుకట్ట వేశారు. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజికవర్గంపై కక్ష తీర్చుకుంటుందన్న వ్యవహారాన్ని జీవీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ఆయన బొల్లా బ్రహ్మనాయుడిపై మైండ్ గేమ్ ను ప్రారంభించారని తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు కమ్మ సామాజికవర్గం వారికి చేసిన ప్రామిస్ ను జీవీ ఆంజనేయులు ఇప్పుడు వెలుగులోకి తెచ్చారు. తాను వైసీపీ నుంచి గెలిచినా టీడీపీలోకి వస్తానని బొల్లా బ్రహ్మనాయుడు కమ్మ సామాజికవర్గానికి చెప్పి ఓట్లను తెచ్చుకున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అంతేకాదు టీడీపీ ప్రభుత్వం హయాంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాంటాక్టు పనులు చేశారు. ఆ బిల్లులను కూడా బొల్లా బ్రహ్మనాయుడు తొక్కి పెట్టారని జీవీ ఆంజనేయులు ఆరోపిస్తున్నారు.దీనికి బొల్లా బ్రహ్మనాయుడు తాను ఎటువంటి ప్రామిస్ చేయలేదని అంటున్నారు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీకి ఎలా వస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. జీవీ ఆంజనేయులు రేషన్ బియ్యాన్ని తరలించి ఏడు వేల కోట్లరూపాయలకు గండికొట్టారని బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపిస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య ఒక సామాజికవర్గాన్ని కాపాడుకునేందుకే మాటల యుద్ధం ప్రారంభమయిందనే అంటున్నారు.

బీజేపీ కి ఉన్న బలం కూడా టీడీపీ కి లేదా…!

చంద్రబాబు కు ఇప్పుడు వాళ్ళే దిక్కా..?

ఛీ. పొమ్మన్న చంద్రబాబు బీజేపీ చెంతకే వెళ్తున్నాడంటే.?

డిక్లరేషన్ పై చంద్రబాబు ఎందుకంత పోరాటం చేస్తున్నారు.. అవి బయటపడతాయనేనా.. ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -