Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రబాబు డ్రామాలకు హద్దులు లేవా.?

- Advertisement -

చంద్రబాబు రాజకీయ విజ్ఞానం అందరికి తెలిసిందే.. పార్టీ ఎలాంటి పొజిషన్ లో ఉన్నా తిరిగి పుంజుకునేలా చేయడంలో చంద్రబాబు వేసే ఎత్తులు అందరికి తెలిసిందే.. ప్రత్యర్థి ని మట్టి కరిపించి తన పని తాను చేసుకునే చంద్రబాబు యుక్తి కి ప్రతిపక్షాలు సైతం అబ్బురపడతారు.. ఇక చంద్రబాబు ప్రస్తుతం పరిస్థితి పైన చెప్పిన దానికంటే పూర్తి గా భిన్నం గా ఉందని చెప్పొచు.. ఓడిపోయి అసలే బాధలో ఉన్న పార్టీ కి చంద్రబాబు ఆసరాగా నిలుస్తుంటే ఇతర టీడీపీ నేతలు మాత్రం వలస వెళ్లిపోతు పార్టీ ని, చంద్రబాబు ను ఇంకా కష్టాలలోకి నెడుతున్నారు..

ఇప్పటికే నలుగురు ఎమెల్యేలు టీడీపీ నుంచి వెళ్లి వైసీపీ కండువా కప్పుకున్నారు.  వాళ్ళతో పాటు వెళ్ళిన దిగువస్థాయి నేతలకైతే లెక్కే లేదు.. ఎంతమంది వెళ్లి ఉంటారో చెప్పలేమని అంటున్నారు..  పెద్ద పెద్ద టీడీపీ లీడర్లు సైతం జగన్ పెట్టె కండిషన్ లకు లొంగి మరీ యా పార్టీ లో చేరుతున్నారు.. ఒక్కో సభ్యుడు దూరమయ్యే కొద్దీ  పార్టీ ఎంత బలహీనమవుతుందో మనకు తెలిసిందే.. అసలు పార్టీ కి ముఖ్యమైనవారే ద్వితీయ శ్రేణి నేతలు.. అలాంటి వారే వందలకొద్దీ వైసీపీ లోకి చేరితే టీడీపీ భవిష్యత్ ఏమైపోతుంది అని ఇప్పటినుంచే చంద్రబాబు తలలు పట్టుకున్తున్నారట.

సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ఓ ప్లాన్ వేశారు.. వైసీపీ లోకి వెళ్ళే వారిని ఆపడానికి అయన తనదైన స్టైల్ లో ఓ పథకం రచించారని తెలుస్తుంది.. బాబు చివరి అస్త్రంగా జమిలీ ఎన్నికల ను పార్టీ నేతలపై సంధించబోతున్నారు..  త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తున్నాయి.. అందులో వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అని టీడీపీ శ్రేణుల్లో నూరిపోస్తున్నారట.. వాస్తవానికి చంద్రబాబుకు జమిలీ ఎన్నికల మీద పెద్ద ఆశ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా త్వరలోనే ఎన్నికలంటూ తన పార్టీ శ్రేణులను నమ్మించే యత్నంలో ఉన్నారు. తద్వారా జగన్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని చెప్పేందుకు యత్నిస్తూనే మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని కాబట్టి పార్టీ మారేందుకు యోచిస్తున్న నేతలను పునరాలోచన చేయాలని చెప్పకనే చెప్పినట్టవుతుంది. మరి ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయన్నది మాత్రం టీడీపీ నేతల్లో కూడా స్పష్టత లేదు.

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

జగన్.. మోడీ తో చర్చకు వచ్చే అంశాలివే.?

వైసీపీలోకి గంటా.. వెంటనే ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -