Thursday, May 23, 2024
- Advertisement -

బాబుతో సంప్ర‌దింపులు పూర్తి ….ఎమ్మెల్సీ ఇచ్చే అవ‌కాశం…

- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో టీడీపీ బ‌ల‌హీనంగా ఉన్న సంగ‌తి తెల‌సిందే. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. వైసీపీకి చెందిన కీల‌క నేత‌ల‌పై దృష్టి సారించారు. దీంతో ఆ పార్టీకి భారీ షాక్ త‌ప్ప‌ద‌నె వార్త‌లు జిల్లా వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. అన్ని కుదిరితే త్వ‌ర‌లోనె వైసీపీ కీల‌క నేత ప‌చ్చ ఖండువా క‌ప్పుకోనున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూలు జిల్లాలో పుర్య‌టిస్తున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరి తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీకి నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీన్ని బాబు ఎవ‌రికి కేటాయిస్తారోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. ఈ ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది.

ఎమ్మెల్సీ రేసులో టీడీపీ ఎవరిని బరిలో దింపనుందనే విషయం చర్చనీయాంశమైంది. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఎలాగైనా తన సోదరుడు రాజా రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో దింపేందుకు సీఎం చంద్రబాబు దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు శ్రీధర్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. అందువల్ల తనకు అవకాశం ఇవ్వాలని శ్రీధర్‌రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని కోరినట్లు తెలుస్తోంది.

వైసీపీకి చెందిన ఓ కీలక నేత టీడీపీలో చేరనున్నారనే వార్త జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబుతో ఆయన మంతనాలు సాగించారని… ఎమ్మెల్సీ టికెట్ కావాలని అడిగారని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ను ఆయనకే ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో, చంద్రబాబు పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. టీడీపీలోకి వెల్లే నాయ‌కున్ని వైసీపీ అప‌గ‌లుగుతుందా…

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -