Wednesday, May 29, 2024
- Advertisement -

ప‌ద‌వికి రాజీనామా చేసి ఓట్లు అడ‌గండి శిల్పా ద‌మ్మున్న‌ స‌వాల్‌…

- Advertisement -

.నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం రోజు రోజుకి విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతోంది.స‌వాల్లు ,ప్ర‌తి స‌వాల్ల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది నంద్యాల ప‌ట్ట‌నం.ప్ర‌ధానంగా వైసీపీకి పిరాయింపు ఆస్త్రం ప్ర‌ధానం కానుంది.టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామ చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో ఆపార్టీ ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది.ప్ర‌చారానికి వెల్లినా ధైర్యంగా చెప్పుకోలేని ప‌రిస్థితి.ఎందుకంటె వీరంద‌రు పిరాయింపుల‌ద్వారా మంత్రి ప‌ద‌వులు పొందిన‌వారు.

చ‌క్ర‌పాణ‌ఙ రాజీనామాతో టీడీపీని ఇరుకున పెట్టేందుకు వైసీపీ పావులు క‌దుపుతోంది.ఈ మేరకు వైసీపీ నేతలు టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాకు మరింత పట్టుబట్టే అవకాశాలు లేకపోలేదు.ఇదిలా ఉంటే శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను మండలి ఛైర్మెన్ ఆమోదించ‌డంతో ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని వైఎస్సార్‌ సీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువల కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన రాజీనామా కోరారని వెల్లడించారు. విలువలకు తమ కుటుంబం కట్టుబడివుంటుందని, తన రాజీనామాతో ఈ విషయం నిరూపితమైందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజాగా చ‌క్ర‌పాణి మంత్రి అఖిల‌ప్రియ‌కు స‌వాల్ విసిరారు.మంత్రి ముందు రాజీనామా చేసి తర్వాత ఓట్లు అడిగితే గౌరవంగా ఉంటుందని అన్నారు. నైతిక విలువలు ఎవరికున్నాయో తన రాజీనామాతో తేలిందని చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారానికి రాజీనామాతో సరైన సమాధానం చెప్పామన్నారు.

ఇక నంద్యాలలో ఆట మొదలైందన్నారు వైసీపీ నేత శిల్పాచక్రపాణిరెడ్డి. నంద్యాలలో వైసీపీని ఓడించేందుకు టిడిపి అనేక కుట్రలను కుతంత్రాలను పన్నుతోందని ఆయన ఆరోపించారు. కానీ, వాటన్నింటిని చేధించి తన సోదరుడు మోహన్‌రెడ్డి నంద్యాలలో విజయం సాధించనున్నట్టు ధీమాను వ్యక్తం చేశారు. ఈ ఆట‌లో ఎవ‌రు విజేత ల‌వుతారో 28 వ‌ర‌కు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -