Sunday, May 12, 2024
- Advertisement -

పిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామ చేసి ద‌మ్ముంటె ఎన్నిక‌ల‌కు రండి.

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం అధికార టిడిపి, విపక్ష వైసీపీలు వ్యూహలను రచిస్తున్నాయి. రాజకీయాల్లో రాటుదేలిన నేతలంతా ఈ ఉపఎన్నికల్లో విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు. వైసీపీ భారీ బ‌హిరంగ నిర్వ‌హించింది.స‌భాలేకా జ‌న‌స‌ముద్రంలా క‌నిపిస్తోంది. శిల్పా సోద‌రులు టీడీపీని దుమ్ముదులిపారు.
తాను ఈ రోజే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వారు కూడా రాజీనామా చేయాలన్నారు. ఈ రోజు నుంచి ఆట మొదలైందన్నారు. ఏ ఆటకైనా మేం సిద్ధమన్నారు. నేను రాజీనామా చేశానని, టిడిపిలో చేరిన వారికి రాజీనామా చేసే దమ్ముందా అని సవాల్ చేశారు.
భూమా ఫ్యామిలీ డ్రామా మొదలైందన్నారు. తాము వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల నాడు గెలిచామన్నారు. తాను రాజీనామా చేశానని చెబుతూ శిల్పా చక్రపాణి రెడ్డి తన రాజీనామా పత్రాన్ని జగన్‌కు అందించారు. తమపై ఏమైనా మచ్చ ఉంటే సిబిఐ విచారణ జరిపించుకోవచ్చునన్నారు. ఓ సందర్భంలో మనం మగాళ్లమా, అడవాళ్లమా.. మగాళ్లమే అన్నారు. జగన్ మొండివాడు అయితే, తాను జగమొండి అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు ఒకటే తేడా అన్నారు. చంద్రబాబు చెప్పింది ఏదీ చేయడని, జగన్ చెప్పిన మాట తప్పడన్నారు.
త‌ల్లిదండ్రుల ఫొటోలు పెట్టుకుని వాళ్లు ఓట్లు అడుక్కుంటున్నార‌ని శిల్పా చ‌క్ర‌పాణి అన్నారు. వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసిన చివ‌రికి ఓట్లు ప‌డేది త‌మ‌కేన‌ని, అన్ని మ‌తాలు, కులాల ఓట్లు త‌మ‌కే అని ఆయ‌న తెలిపారు. జ‌న‌మే త‌మ‌కు దేవుళ్లని, వాళ్లేం తెలివి త‌క్కువ వాళ్ల కాదని, ఎవ‌రికి ఓట్లు వేయాలో వాళ్ల‌కి బాగా తెలుసని శిల్పా సోద‌రులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -