Saturday, April 20, 2024
- Advertisement -

నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!

- Advertisement -

నేడు సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్‌ నియోజకర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధి విషయంలో భారీగా నిధులు ప్రకటించారు. నెల్లికల్ వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం హాలియా మండలం పాలెంలో ధన్యవాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.  హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. సభ ప్రారంభంలో ముఖ్యమైన నాలుగు వరాలు ప్రకటించారు.

ప్రస్తుత నల్గొండ జిల్లాలో 844 గ్రామాలున్నాయని.. ప్రతి గ్రామ పంచయతీకి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు, మిగతా ఒక్కో మున్సిపాలిటీకి రూ. కోటి కేటియిస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. జిల్లాలో 8 మున్సిపాల్టీలున్నాయి..మిర్యాలగూడ మున్సిపాల్టీకి రూ. 5 కోట్లు, ఒక్కో మున్సిపాల్టీకి రూ. 1 కోటి మంజూరు చేస్తున్నా.

మొత్తంగా ప్రభుత్వానికి రూ. 1086 కోట్లు ఖర్చవుతున్నాయి. రేపే జీవో జారీ చేస్తాం. నిధులు మంజూరు చేస్తాం’ అన్నారు సీఎం కేసీఆర్. కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి.

త్వరలోనే..అర్హులైన వారికి కొత్త పెన్షన్ మంజూరు ప్రక్రియ చేపడుతామని, నూతన రేషన్ కార్డుల ప్రక్రియ జారీ చేస్తామన్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2వేల 395 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు.

షర్మిల రాజకీయ ప్రవేశాన్ని మేం తప్పుపట్టడం లేదు..!

సంపూ హీరోగా ‘బజారు రౌడీ’ స్టిల్ అదుర్స్!

కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అరెస్ట్..చర్లపల్లి జైలుకు తరలింపు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -