రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు ఎక్కువయ్యాయి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధక్షుడు సోము వీర్రాజు ఫైరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని తాము ప్రశ్నించినందుకు తమ వ్యాఖ్యలను తప్పు బట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి తాము కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదిక పంపుతున్నామన్నారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని, ఓటీఎస్‌ ద్వారా ప్రజల సొమ్మును దౌర్జన్యంగా లాక్కుంటున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. పార్లమెంట్‌ సమావేశాల అనంతరం ఏపీ బీజేపీ ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉందని ఆ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై కేంద్రానికి తెలియజేస్తామన్నారు.

- Advertisement -

మరోవైపు వైసీపీ నేతలు తమ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అధికారం ఉంది కదా అని ప్రజలపై, అధికారులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాతున్నారని విమర్శించారు. వైసీపీ నాయకుల మాటలు భరించిన చాలా మంది తమ గోడును మా వద్ద వెళ్లబోసుకున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.

చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది

తెలంగాణ ఏంపీలకు మోడీ వార్నింగ్?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -