చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది

- Advertisement -

టీఆర్‌ఎస్ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ, టీపీపీ చీఫ్ రేవంత్ రెడ్డి హాగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాని ఎండగుడుతామని ఢిల్లీకి వెళ్లిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేతులు ముడుసుకొని తిరుగు ప్రయాణం అయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌, బీజేపీతో ఒప్పందం పెట్టుకొని ఎంపీలతో సభలో రాద్దాంత డ్రామా చేయించారని మండిపడ్డారు. సభను బహిష్కిరించి ఎంపీలు అందరూ హైదరాబాద్‌ రావాలని కేసీఆర్‌ అంటేనే ఎంపీలు మూటా ముళ్లే సర్థుకున్నారని విమర్శించారు. పార్లమెంట్‌ సమావేశాలు మొత్తం కేసీఆర్‌, నరేంద్రమోడీ కనుసన్నల్లో నడుస్తున్నాయన్నారు.

బీజేపీతో ఒప్పందం పెట్టుకున్న సీఎం.. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని కొడుక్కి అప్పగించి తాను ఢిల్లీలో పధవి పొందే విదంగా ఆలోచిస్తున్నారన్నారు. ఇలా చేస్తే ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని జోస్యం చెప్పారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రైతులు వానకు తడుస్తూ, చలికి వణుకుతూ వడ్ల రాసుల వద్ద బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారని, తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో తెలియని స్థితిలో ఉన్నారన్నారు. మరోవైపు వచ్చే సిజన్‌లో ప్రత్యామ్నాయ పంట ఏది వేసుకోవాలో తెలియక రైతాంగం అయోమయంలో పడిందన్నారు.

తెలంగాణ ఏంపీలకు మోడీ వార్నింగ్?

పార్లమెంట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -