Friday, March 29, 2024
- Advertisement -

టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?

- Advertisement -

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పై కొన్ని ఎల్లో మీడియా లు పనిగట్టుకుని విష ప్రచారాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. జర్నలిజం విలువలను మరిచిపోయి, రాష్ట్రం గర్వించదగ్గ పదవిలో ఉన్న సంగతి చూడకుండా, దేనికి పదును పెట్టారో తెలియక ఇలాంటి నీచమైన పనులకు వారు తమ చదువును వాడుకోవడం చాల హాస్యాస్పదంగా వుంది.. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను, అలాగే జగన్ దూకుడును, పార్టీ నేతల వ్యవహారశైలిని అన్ని పూసగుచ్చినట్లు చెడుగా రాయడంలో ఆ మీడియా సంస్థలు సఫలమయ్యాయి.. అయితే ఇవి పట్టించుకునే టైం అధికార పార్టీ కి లేవు.. ఎందుకంటే ప్రజలు నాయకుడిగా వచ్చి సీఎం గా ఎదిగిన జగన్ ప్రజలే అసలైన మీడియా.. పని జరగకపోతే, పాలనా జరగకపోతే వారే తనకు పలానా లోపం ఉందని చెప్తారు.. కానీ ఇలా పైడ్ సంస్థలు లేనిపోనివి రాస్తే జగన్ పట్టించుకునే స్టేజి ఎప్పుడో దాటేశారు.. నిజానికి జగన్ వారిని పట్టించుకుంటే ఒక్క రోజు పని కానీ ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఎల్లో పార్టీ ని ఈ విధంగా దెబ్బకొట్టే రాజకీయం తాను చేయొద్దనుకుంటున్నాడు..

ఇక ఇదిలా ఉంటే జగన్ ఇటీవలే బీసీ లకు గతంలో ఎప్పుడు లేనంతగా దగ్గరయిపోయాడు.. 2019 ఎన్నికల్లో అన్ని సామాజికవర్గ ప్రజలు వైఎస్‌ జగన్‌ను ఆదరించారు. ఈ ఎన్నికల్లోనే తమకు ఆది నుంచి వెన్నంటి ఉన్న బీసీలు దూరం అవుతున్నారని టీడీపీ నేతలకు అవగతమైంది. తనను ఆదిరించిన అన్ని సామాజికవర్గ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌.. తాను ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా మునుపెన్నడూలేనంతగా లబ్ధి జరుగుతోంది. వైఎస్సార్‌ నేతన్న హస్తం, చేదోడు, వైఎస్సార్‌ చేయూత.. ఇలా అనేక పథకాలతో బీసీ సామాజికవర్గ ప్రజలకు ఆర్థికంగా మేలు జరుగుతోంది.

ఈ క్రమంలో జగన్ వారికీ దగ్గరవడం టీడీపీ కి జీర్ణించుకోలేకపోతుంది. బీసీలు దూరం అయ్యారని, తిరిగి వారిని దగ్గరచేసుకునేందుకు నేతలు పని చేయాలంటూ ఇటీవల నిర్వహించిన జూమ్‌ మహానాడు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మేలుతో టీడీపీ నేతలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ బీసీలకు దగ్గరయ్యేందుకు ఒక్క అవకాశం కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో శివాలెత్తిపోతున్నారు. బీసీ సామాజికవర్గ ప్రజలకు కొత్త పథకం ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీలోని బీసీ నేతలు మీడియా ముందుకు వచ్చి సదరు పథకంపై విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు తీరు టీడీపీ ఎమ్మెల్యేల కు నచ్చలేదా..?

టీడీపీ ఇంత దిగాజరడానికి చంద్రబాబే కారణమట..

ప్రతి చిన్న విషయానికి పొలోమంటూ వచ్చే బీజేపీ నోరు మెదపదేం

రాజు గారి ఓవర్ కాన్ఫిడెన్స్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -