Saturday, April 20, 2024
- Advertisement -

రాజు గారి ఓవర్ కాన్ఫిడెన్స్..

- Advertisement -

వైసీపీ తరపున గెలిచినా రఘు రామ కృష్ణ రాజు ప్రస్తుతం ప్రతిపక్షం కన్నా ఎక్కువగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గత కొన్ని రోజులు గా అయన వైసీపీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనను పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశాయి.. స్వయంగా సీఎం జగన్ ఆయనపై ఫోకస్ పెట్టారంటే రాజు గారు ఏ లెవెల్ లో విమర్శించారో అర్థం చేసుకోవచ్చు.. ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి జగన్ అక్కడి పెద్దలతో రాజు గారి వ్యవహారం చెప్పి ఆయనను పదవినుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే వైసీపీ నేతలు ఎంత హెచ్చరిస్తున్నా రాజు గారు మారకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. టీడీపీ లో చంద్రబాబు లాంటి వాళ్ళను నిలువరిస్తున్న వైసీపీ నేతలు సొంత పార్టీ ఎంపీ ని మాత్రం ఆపలేకపోతున్నారు..

నేరుగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైసీపీ నేతలు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు.. ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీజేపీ అండతో ఇదంతా చేస్తున్నారని తెలిసినా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అయితే జగన్ కూడా ఈ విషయంలో బీజేపీ తో చేతులు కలిపారు.. అందుకోసం ఇటీవలే ఢిల్లీ కూడ వెళ్లారు..అయితే జగన్ ఢిల్లీ మంతనాలు ఫలించాయి.. ఇటీవలే పార్లమెంటరీ స్టాండర్డ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించారు. ఆయన స్థానంలో వైసీపీకి చెందిన ఎంపీ బాలసౌరిని నియమించింది . పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేసారంటూ బ్యాంక్ వర్గాలు చేసిన పిర్యాదు మేరకు సీబీఐ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం .

ఈ విషయంపై రఘు రామ కృష్ణం రాజు స్పందించారు.. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు పదవి పోయినా రాజుగారి విమర్శల ఘాటు ఇంకా తగ్గలేదని చెప్పాలి.. నిన్న రాత్రి రఘురామ రాజు మీడియాకి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఆ పదవి తన స్వయంకృషితో తెచ్చుకున్నా వైసీపీ ఎంపీగా పార్టీ ద్వారా తనకి వచ్చిందని , తనని పదవి నుండి తప్పించలేదని ఏడాది గడువు ముగియడంతో తానే దయ తలచి ఇచ్చానన్నట్టు చెప్పుకొన్నారు . ఒహవేల తనని పార్టీ నుండి డిస్మిస్ చేస్తే పులివెందులలో పోటీ చేసి రెండు లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చుకొంటానని సవాల్ విసిరిన రఘురామ రాజు దాన్ని అమరావతి పై రిఫరెండం గా తీసుకోవాలని కోరారు .

రాజు గారి కి దెబ్బ అదుర్స్ కదూ..

రాజు గారు మళ్ళీ వేసేశారు…!

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

జనాల్లోకి కదిలిరనున్న జగన్.. బాబు ఇంటికేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -