Thursday, April 25, 2024
- Advertisement -

బద్దలవుతున్న టీడీపీ కంచుకోటలు….ఆ విషయంలో బాబు చేతులెత్తేసినట్లేనా…?

- Advertisement -

తెలంగాణాలోగా తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఏపీలో కూడా ఆదిశగా పయనిస్తోంది. పార్టీ నుంచి నాయకులు వేరే పార్టీలోకి వలస వెల్లిపోతున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాఉత్తరాంధ్ర జిల్లాలు… ఈ ఎన్నిక‌ల్లో ఆ కంచుకోట‌ల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ కూక‌టివేళ్ల‌తో స‌హా పెకిలించారు. పార్టీకి భవిష్యత్ పై నమ్మకం లేకపోవడంతో వ‌రుస పెట్టి నేతలు ఇత‌ర పార్టీల్లోకి మారిపోతున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా విశాఖపట్నం జిల్లాలో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీడీపీ శాసనసభ్యుడు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచినా గంటాకు సంత్రుప్తికరంగా లేదంట. ఎందుకంటే గంటాకు అధికారం లేక‌పోతే రోజు గ‌డ‌వ‌దు అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హారాలు న‌డుస్తుంటాయ్‌. ఈ క్ర‌మంలోనే గంటాతో పాటు ఉత్త‌రాంధ్ర‌లో ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం అంతా క‌లిసి వైసీపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ అయ్యాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 2వ తేదీన గంటా బ్యాచ్ వైసీపీలో చేరుతుందని సమాచారం. పార్టీలోకి రావాలంటె పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ పెట్టిన కండీషన్ కు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గంటాను చేర్చుకోవడానికి వైఎస్ జగన్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది వైసీపీలో చేరాక ఆయనకు దక్కే అవకాశాలపైనే ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని సమాచారం.

గంటాతో పాటు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే నాయుడు, తదితరులు వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మరోనేత కూడా వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్దమయ్యారు.ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర‌లో అడారి అజయ్ – మాజీ చైర్ పర్సన్ రమాకుమారి – మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు – మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు కూడా వైసీపీలో చేరడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు గంటాతో పాటు ఓ బ్యాచ్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతే చంద్ర‌బాబుకు ఇది మామూలు షాక్ కాదు. వలసలను ఆపడంలో చంద్రబాబు చేతులెత్తేశారనె చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -