Sunday, May 5, 2024
- Advertisement -

సోషల్ మీడియా ప్రచారంలో టీఆర్ఎస్ విఫలం

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహాకూటమి అభ్యర్ధులను ఖరారు చేయకపోయినా కూటమిలోని పార్టీల అధ్యక్షులు ప్రచారం చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించడంతో వాళ్లు గత నెల రోజులుగా ప్రచారంలో మునిగిపోయారు. మందిమార్బలంతో ఊరూ వాడా తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి మళ్లీ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రత్యర్ధి పార్టీల కంటే చాలా ముందుగా టీఆర్ఎస్ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించేయడంతో వారికి లాభం కంటే నష్టాన్నే ఎక్కువ కలిగిస్తున్నట్టుంది. ఇప్పటికే నెల రోజులుగా టీఆర్ఎస్ అభ్యర్ధుల ఖర్చు లెక్కకందనంతగా సాగుతోంది. అభ్యర్ధిత్వం ఖరారు అయిపోయాక ఇంక వెనుకడుగు వేస్తే నష్టపోతామనే భయంతో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఖర్చుకు వెనుకాడటం లేదు. సొంత డబ్బులతో పాటు పార్టీ ఫండ్ తెచ్చి నియోజకవర్గంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కొందరు అభ్యర్ధులకు ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల నుంచి చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇన్నాళ్లూ ఏడ చచ్చారు ? ఇచ్చిన హామీల సంగతి ఏం చేశారు ? అంటూ ఓటర్లు నిప్పులు చెరుగుతున్నారు. అభ్యర్ధులు ముఖం మీదే ఓటర్లు నిలదీస్తుండటంతో ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాయి. అధికార పార్టీ అభ్యర్ధుల మీద అంత తీవ్ర ప్రజా వ్యతిరేకత ఏ ఒక్క నియోజకవర్గానిదో కాదని, అది అన్ని నియోజకవర్గాల్లోనూ అంతే స్థాయిలో ఉందనే అనుమానాలు రేకెత్తిస్తోంది.

మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియాలో గత మూడు నాలుగేళ్లుగా టీఆర్ఎస్ కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. యాంటీ కేసీఆర్ పేరుతో వందల పాట్ల లక్షల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబపాలనను ఎండగడుతూ తెలంగాణ కవులు కళాకారులు చేస్తున్న ప్రచారం బాగా ఊపందుకుంది. ఒక్కో పాట తూటాలా పేలుతోంది. కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను, అధికారం చేపట్టాక మాట్లాడిన మాటలు, చెప్పిన అబద్ధాలను పోల్చుతూ వీడియోలు షేర్ అవుతున్నాయి. యూ ట్యూబ్ లో అయితే కేసీఅర్ కుటుంబపాలన, టీఆర్ఎస్ వైఫల్యాలు, ఆ పార్టీ ఫిరాయింపులు, హామీల అమలులో విఫలంపై పాటలు లక్షల వ్యూస్ తో లైక్స్ తో ట్రెండింగ్ అవుతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్ధులను ప్రజలు తిరస్కరిస్తున్న విజువల్స్, విమర్శిస్తూ ఎండగడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ మీడియాను భయపెట్టో, బతిమాలో దారిలోకి తెచ్చుకున్నారు కానీ, సోషల్ మీడియా విషయంలో మాత్రం పూర్తిగా చేతులెత్తేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆయన కుమారుడు కేటీఆర్ స్వయంగా ఐటీ శాఖ మంత్రి కావడం. ఆయన ఐటీ శాఖ మంత్రి అయి ఉండి కూడా తమ పార్టీకి సోషల్ మీడియాలో సానుకూల ప్రచారం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఇప్పటికే ఉన్న నెగిటివ్ ప్రచారం ముందు ముందు మహాకూటమి ద్వారా మరింత పెరగనుంది. 2014 నుంచి ఏ ఎన్నికలు జరిగినా మీడియా కంటే సోషల్ మీడియానే ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత మరింత పెరిగి 2019లో వారి పరాజయానికి బాటలు వేస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -