Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబు అంటే కేసీఆర్ కు అంత భయమెందుకు ?

- Advertisement -

నల్గొండ జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతదో తెలుసుకో.. తెలంగాణ దెబ్బ తగిలే విజయవాడ కరకకట్టకు ఎగిరిపడ్డావ్. తెలుగు ప్రజలంతా ఒక్కటే అంటూనే తెలంగాణ కొంప ముంచావ్. అని మండిపడ్డారు. నేను ప్రాణాలు ఫణంగా పెట్టి తెచ్చిన తెలంగాణను మళ్లీ చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెడతారా ? రేపు ఫైళ్లు పట్టుకుని అమరావతి పోవాలా ? హైదరాబాద్ పోవాలా ? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు బొడ్డులో కత్తి పట్టుకుని తిరుగుతున్నారని, తెలంగాణ ప్రజలను పొడిచి పారేస్తాడు జాగ్రత్త అంటూ కేసీఆర్ తీవ్రపదజాలం వాడారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు కట్టనిస్తడా. తెలంగాణలో అధికారం కోసం ఎంతకైనా కాంగ్రెస్ టీడీపీ దిగజారుతారా. చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటి చేస్తానంటున్నారు. ఆయన నయవంచకుడు, తెలంగాణ ద్రోహి. నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడఉ. చంద్రబాబు కుట్రలను తెలంగాణ సమాజం అర్ధం చేసుకుని తిప్పికొట్టాలి. అంటూ కేసీఆర్ ఉపన్యసించారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్లీ తెలంగాణ బానిసలు కావాలి. తెలంగాణ మేథావులు ఈ విషయాలపై ఆలోచన చేసి ఈ కుట్రను తిప్పి కొట్టాలన్నారు. సిగ్గు, శరం, పౌరుషం లేకుండా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్‌ నేతలపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ పొత్తును తెలంగాణ సమాజం ఆమోదిస్తాదా?.. చిల్లర రాజకీయం కోసం నీచంగా దిగజారారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ టీడీపీ నేతలకు సిగ్గు లేదని, మహాకూటమా..? కాలకూట విషమా…? నీ బొంద కూటమా? అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మోడీని నాలుగేళ్లు అడ్డం పెట్టుకుని 7 మండలాలు లాక్కున్నావ్ అన్నారు. కోర్టు విభజనను అడ్డుకున్నారని మండిపడ్డారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటారని ఆరోపించారు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఫైళ్లు పట్టుకుని మల్లీ అమరావతి పోవాలని కేసీఆర్ అన్నారు.

అయితే కేసీఆర్ స్పీచ్ లో స్పష్టంగా చంద్రబాబుపై భయం బయటపడింది. తాను మళ్లీ ఎందుకు అధికారంలోకి రావాలో ? వస్తే ఏ వర్గానికి ఏం చేస్తాడో ? ఇచ్చిన హామీలలో గత నాలుగేళ్లలో ఏమేం నెరవేర్చాడో చెప్పడం కంటే చంద్రబాబుపై విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు కేసీఆర్. మహాకూటమి గెలిస్తే ఫైళ్లు పట్టుకుని అమరావతి వెళ్లాలని చెప్పడం ఏంటో ? మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణ సీఎం కాడు కదా ? మరి అలాంటప్పుడు ఫైళ్లు పట్టుకుని అమరావతి ఎందుకు వెళ్లాలి కేసీఆర్ ? టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రాజెక్టులు అడ్డుకుంటారన్నావ్. 2014లోనూ టీడీపీ తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలను గెల్చుకుంది. మరి ప్రాజెక్టులు అడ్డుకున్నారా ? నువ్వేగా ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించి వాళ్లందరినీ నీ పార్టీలో నీ చంకలో పెట్టుకున్నావ్. అన్నాళ్లూ టీడీపీ నేతలు తెలంగాణ ద్రోహులు అని విమర్శించి, ఆఖరికి అధికారం రాగానే వారినే తిరిగి నీ పార్టీలో పెద్ద పీట వేసి మరీ తీసుకున్నావ్. ఎమ్మెల్యేను కొనుగోళ్లు చేసిన నీకు మళ్లీ టీడీపీ 15 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే కొనుగోలు చేసే శక్తి లేదా ? మరి నీకెందుకంత భయం. వచ్చే ఎన్నికల్లో నీ పార్టీ గెలిస్తే ఏం చేస్తావో చెప్పడం కంటే, చంద్రబాబుని రెచ్చగొట్టడం, సీమాంధ్రులను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధ పొందాలని చూస్తున్నావ్.

చంద్రబాబుని బూచిగా చూపి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పట్టాలని చూస్తున్న కేసీఅర్ కి చంద్రబాబు అంటే ఎంత భయమో అర్ధమవుతోంది. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలను వదిలేసి, మహాకూటమిలో భాగమైన టీడీపీని కేవలం టార్గెట్ చేయడం, చంద్రబాబుపై విమర్శలు చేయడం చూస్తుంటే బాబు అంటే కేసీఅర్ కు ఎంత భయమో తేటతెల్లమైంది. తాను ఇప్పటికే హామీలు అమలులో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్, మళ్లీ కొత్త హామీలు ఇస్తే ప్రజలు నమ్మరని భావించినట్టుంది. అందుకే ప్రజలను రెచ్చగొట్టి, చంద్రబాబును విలన్ గా చూపించి, లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని తేలిపోయింది. తాను ఏం చేస్తాడో ? ఎలా ఉద్దరిస్తాడో ఏడవకుండా మళ్లీ చంద్రబాబుపై ఏడవడం, అతడినే లక్ష్యంగా విమర్శలు చేయడంతో కేసీఆర్ కు చంద్రబాబు అంటే ఎంత భయమో స్పష్టంగా అర్ధమయింది. మహాకూటమిని విర్శించింది కూడా అందుకేనని తేలిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -