Sunday, May 12, 2024
- Advertisement -

టీడీపీ, జనసేన క‌లిసి పోటీ చేస్తే త‌ప్పేంటి – టీడీపీ ఎంపీ

- Advertisement -

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపి ఆ పార్టీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌త్య‌క్షంగా స‌హయం చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టీడీపీ పార్టీ, ప‌వ‌న్ జ‌న‌సేన‌ల మ‌ధ్య దూరం పెరుగుతు వ‌చ్చింది.

అయితే రాష్ట్రంలో మ‌ళ్లీ ఎన్నికల హ‌డ‌విడి మొద‌లు కావ‌డంతో రాజ‌కీయ పొత్తులు కోసం టీడీపీ మ‌ళ్లీ త‌న వేట‌ను కొన‌సాగిస్తుంది. 2019లో జరిగే ఎన్నిక‌ల‌లో ఒంట‌రిగా ఎన్నిక‌ల‌కు వెళ్తే ఓట‌మి త‌ప్ప‌ద‌ని గ్రహించిన టీడీపీ ఎలాగైన ప‌వ‌న్‌ను త‌మ‌తో క‌లుపుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తోంది. దీనిలో భాగంగానే టీడీపీ నేత‌లు టీడీపీ,జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా టీడీపీ ఈ వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకురుస్తు కొన్ని కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ టీడీపీ, జనసేనల మ‌ధ్య ఉన్న ర‌హ‌స్య ఒప్పందాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

బుధ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతు.. జనసేనతో తెలుగుదేశం పార్టీకి పెద్దగా విభేదాలు లేవని ఆయన అన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య మార్చిలో చర్చలు జరిగే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ చెప్పారు. రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీల మ‌ధ్య కేవలం కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డంలోనే అభిప్రాయ‌భేదాలు ఉన్నాయాని మిగత విష‌యాల‌లో రెండు పార్టీల ఆలోచ‌న‌లు ఒకేలా ఉంటాయని టీజీ వెంకటేష్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -