Thursday, May 2, 2024
- Advertisement -

ఎవరు మౌనంగా ఉన్నా ఈ టీడీపీ లీడర్లు మౌనంగా ఉండడం ఏంటి..?

- Advertisement -

టీడీపీ లో ఫైర్ బ్రాండ్ ల నేతలకు కొదువ లేదు.. చంద్రబాబు హయాంలో చంద్రబాబు పై ఈగ కూడ వాలనిచ్చేవారు కాదు ఈ ఫైర్ బ్రాండ్ లు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌, పంచుమ‌ర్తి అనురాధ‌, స‌బ్బం హ‌రి, గంటా శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.., బోడే ప్ర‌సాద్‌, కేశినేని నాని, బీటెక్ ర‌వి, బుద్దా వెంక‌న్న ఇలా చాలామంది టీడీపీ కి గట్టి లీడర్లు గా ఉండేవారు.. టీడీపీ తరపున అప్పటి ప్రతిపక్షాలను కోలుకోనివ్వకుండా చేశారు.. టీడీపీ తో పెట్టుకోవాలంటే వీళ్ళను చూసి సగం భయపడేవాళ్లు ప్రతిపక్ష నేతలు.. అలాంటిది ఈ నేతల నోళ్లు గత కొన్ని నెలలుగా మూగబోయాయి..

ప్రజల్లో ఫైర్ బ్రాండ్ అనే బ్రాండ్ తో పాటు సోషల్ మీడియా లో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా వీరు చేసే విమర్శలు మారుతూ వచ్చాయి.. యంగ్ లీడర్స్ లా వీళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీ నేతలను విమర్శించేవారు.. వైసీపీ లో కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, వంగా గీత‌, వైవీ సుబ్బారెడ్డి, ఆమంచి కృష్ణ‌మోహ‌న్, రోజా  ఇలా చాలా మంది ఫైర్ బ్రాండ్ లు ఉన్నారు.. వీరు ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. పెద్ద సంచ‌ల‌నం.  వారు ఏ కామెంట్ చేసినా.. వ్యూస్ అదిరిపోతుంటాయి. ఇలానే.. టీడీపీలోనూ వీరు  చాలా హల్చల్ చేసేవారు..

కానీ గత కొద్దీ రోజులుగా వీరు వైసీపీ పై పెద్దగా వ్యాఖ్యలు చెయ్యట్లేదు.. అందుకు కారణం ఎక్కడ జగన్ కు కోపం తెప్పిస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని అంట. ఇప్పటికే అచ్చెన్న వంటి పెద్ద పెద్ద లీడర్లను జగన్ ఊచలు లెక్క పెట్టించాడు. ఇప్పుడు ఉన్న సమయంలో మంచి గా మాట్లాడిన టీడీపీ నేతలను లోపల వేయిస్తున్నాడు.. అలాంటి విమర్శిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతున్నారట.. దీంతో అస‌లు పార్టీలో ఏమైంది? ఫైర్ బ్రాండ్ల‌తో ఇక‌, ప‌డ‌లేక వీరిని దూరం పెట్టారా? లేక‌.. వివాదాలు కొని తెచ్చుకోవ‌డం ఎందుక‌ని భావిస్తున్నారా? అనే కోణంలో త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతుండడం గ‌మ‌నార్హం.

అయ్యో మంత్రి గారు ఏంటి ఈ వరుస ఆరోపణలు.. నిజమేనా..?

జగన్ మనసులో గంటా శ్రీనివాస్ రావు పార్టీ లోకి రావాలనే ఉందా..?

అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.?

సబ్బం హరికి ఇప్పుడు బుద్ధి వచ్చిందా.. ఏం లాభం అయిపోయాకా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -