Monday, May 20, 2024
- Advertisement -

ఆళ్లగడ్డ పంచాయితీకి డుమ్మా కొట్టిన మంత్రి అఖిల‌ప్రియ‌

- Advertisement -

ఏపీ సీఎం చంద్రాబాబుకు అఖిల‌ప్రియ షాక్ ఇచ్చింది. మంత్రి అఖిల‌, ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య‌నున్న విబేధాలు తెలిసిందే. ఈ పంచాయితీ కాస్త మ‌రో సారి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు చేరింది. సైకిల్‌ ర్యాలీ సందర్భంగా రాళ్లదాడి ఘటన‌ను సీరియ‌స్‌గా తీసుకున్న చంద్ర‌బాబు ఇద్ద‌రినీ అమరావతి రావాల్సిందిగా ఆదేశించారు.

ఇప్ప‌టికే ఏవీ సుబ్బారెడ్డి అమరావతి చేరుకున్నారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదంటూ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. ఈ భేటీ నిన్న నిర్వహించాలని చూడగా.. తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ నిన్న చెప్పిన విషయం తెలిసిందే.

అఖిలప్రియ ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఏవీ అన్నారు. తండ్రి లాంటి తన మీద ఆమె రాళ్లు రువ్వించిందని, ఇప్పుడు చంద్రబాబు రమ్మన్నా రాలేదని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని తను అన్నాను అని, అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాను అన్నాను తప్ప, తనంతకు తాను పోటీ చేస్తానని అనలేదని ఏవీ వ్యాఖ్యానించారు.

మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలపై ఆగ్రహించిన చంద్రబాబు …వారిద్దర్నీ బుధవారం సాయంత్రం అమరావతికి వచ్చి కలవాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే సీఎం కలవమని చెప్పిన ఒకరోజు ముందే ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -