Thursday, April 25, 2024
- Advertisement -

కేసీఆర్ కంటే జగనే బెటర్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -

తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కరోనా కట్టడిలో ఆయన భేష్ అంటూ కితాబిస్తున్నారు. కరోనా వైరస్ ని అదుపు చేయడంలో సీఎం కేసిఆర్ పనితీరు అధ్వానంగా ఉందన్న ఉత్తంకుమార్ రెడ్డి.. జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ప్రతి 100 కరోనా టెస్టులకు 25 నుండి 30 కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొత్తంగా 6200 కరోనా టెస్టులు నిర్వహించగా 1879కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురికి కరోనా సోకిందన్నమాట.

ఈ నేపథ్యంలో రానున్న కొద్దిరోజుల్లో హైదరాబాద్ మరో ముంబైలా తయారవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిర్వహణలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా టెస్టుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న కేసీఆర్ రోగులకు మెరుగైన వైద్యం అందించడం లేదు అన్నారు. పక్క రాష్ట్రంలో జగన్ రోజుకు వేళల్లో కరోనా టెస్టులు నిర్వహించడంతో పాటు కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక అనేక మంది రోగులు మరణిస్తున్నారని అన్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించిన వారు డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. రోజుకి డెబ్బై వేల నుండి లక్షరూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుండి వసూలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో కరోనా అదుపులో ఉండగా సడలింపు అనంతరం తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా హైదరబాద్ లో కరోనా వైరస్ నియంత్రణ ప్రభుత్వానికి అంతుపట్టని విషయంగా మారింది. కరోనా టెస్టులు నిర్వహించే కొలది కేసులు బయటపడుతున్నాయి. కరోనా విషయంలో కేసీఆర్ వైఖరిని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సైతం తప్పు పట్టారు. కరోనా విషయంలో అలసత్వం పనికిరాదని..భుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ కనిపించకపోవడం.. ఆయనకు కరోనా సోకిందని ప్రచారం జరగడం ఆందోళన రేపుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ బీజేపీ నాయకులు కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు.

పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి : జగన్ పై ముద్రగడ కామెంట్స్

రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు..?

జగన్ ని అభినందించిన పవన్..!

మోకా భాస్కరరావు హత్య వెనుక కొల్లు హస్తం.. : ఎస్పీ రవీంద్రనాథ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -