Monday, April 29, 2024
- Advertisement -

మోకా భాస్కరరావు హత్య వెనుక కొల్లు హస్తం.. : ఎస్పీ రవీంద్రనాథ్‌

- Advertisement -

మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు ఇటీవలే దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఏపీలో సంచలనం రేపింది. అయితే మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సూత్రదారి ఎస్పీ రవీంద్రనాథ్‌ అన్నారు. నిందితుల నుండి వాంగ్మూలం తీసుకున్నామని.. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

రవీంద్రకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని.. కానీ ఆయన ఇంట్లో లేరని.. దాంతో తూర్పుగోదావరి జిల్లా వద్ద ఆయనను అదుపులోకి తీసికుని వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచినట్లు చెప్పారు. మచిలీపట్నంకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మోకా భాస్కరావుకు, టీడీపీ నేతగా ఉన్న చింతా నాంచారయ్య అలియాస్ చిన్ని మధ్య రాజకీయపరమైన పాతకక్షలు, గొడవలు ఉన్నాయని ఎస్పీ అన్నారు. 2013 నుంచి మోకా హత్యకు ప్రయత్నించారని కానీ కుదరలేదన్నారు. ఇప్పుడు మళ్లీ భాస్కరరావును చంపేందుకు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. చిన్నికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా అండదండలు ఉన్నాయని.. అంతా తాను చూసుకుంటానని చెప్పారని.. తన పేరు ఎక్కడ చెప్పవద్దని ముద్దాయిలకు ముందే చెప్పారన్నారు.

ఈ హత్య చేయించడానికి గత నాలిగైదు నెలలుగా ప్లాన్ చేశారని.. కానీ కుదరకపోవడంతో గత నెల 28న కూడా స్కెచ్ వేశారన్నారు ఎస్పీ. మళ్లీ మరసటి రోజు 29న చిన్ని మరో ఇద్దరితో కలిసి మోకా భాస్కరరావును చంపి అక్కడి నుంచి పారిపోయారని.. తర్వాత కొల్లు రవీంద్రతో ఫోన్ టచ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తన ఫోన్‌కు కాకుండా పీఏ రిజ్వాన్‌తో పాటూ మరికొందరు అనుచరుల మొబైల్స్‌కు ముద్దాయిలు కాల్ చేసి రవీంద్రతో మాట్లాడినట్లు తేలిందని అన్నారు. నిందితుల నుండి ఆధారాలు.. వాంగ్మూలం తీసుకున్న తర్వాతే కొల్లు రవీంద్రను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు.

జగన్ ని అభినందించిన పవన్..!

రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు..?

పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి : జగన్ పై ముద్రగడ కామెంట్స్

వైఎస్‌ఆర్‌కి అర్దం ఏంటో చెప్పిన దేవినేని ఉమ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -