Wednesday, April 24, 2024
- Advertisement -

ఈనెల 16కు రైలు దహనం కేసు వాయిదా.. కారణం అదేనా?

- Advertisement -

తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద రత్నాచల్ ఎక్స్​ప్రెస్ దహనం కేసులో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విజయవాడ రైల్వే కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నాలుగు రోజుల క్రితం రైల్వే కోర్టు ముద్రగడతో పాటు మరో 40 మందికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ముద్రగడతో పాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఐకాస ముఖ్య నాయకులు మంచాల సాయిసుధాకర్ నాయుడు, ఆమంచి సోములు, జీవీ సుధాకర్ నాయుడు, ఆకుల రామకృష్ణ, సామన ప్రభాకర్ కోర్టులో హాజరయ్యారు.

ముద్రగడకు సంఘీభావంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు నగరానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రైల్వే కోర్టు ప్రాంగణంతో పాటు నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ నుంచే కాకుడా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ఐకాస నాయకులు విజయవాడ చేరుకున్నారు. కాగా, పూర్తి స్థాయిలో నిందితులు హాజరు కాని కారణంగా.. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

దాంతో తునిలో రైలు దహనం కేసు విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. ఇక 2016 జనవరిలో కాకినాడ – జగ్గంపేట మధ్య.. కాపు ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఆందోళనల్లో రైలును దహనం చేశారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సహా 41 మందిపై వివిధ సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎల్లో డ్రెస్‌లో అద‌ర‌గొడుతున్న హాట్ బ్యూటీ శ్రీముఖి

స్టాలిన్ పై ఊహకి అందని వ్యక్తి పోటీ.. ఎవరో తెలుసా..!

ఏపి పోలీస్ విభాగంలో కీలక నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -