Friday, March 29, 2024
- Advertisement -

నిన్న ఎంపీ…నేడు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌ పార్టీకీ రాజీనామా

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకీ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. సీనియ‌ర్ నేత‌లంద‌రూ కారుదిగి హ‌స్తం కండువా క‌ప్పుకుంటున్నారు. దీంతో గులాబీ బాస్ ఆందోళ‌న‌లో ఉన్నారు. పార్టీ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి పార్టీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ కండువ క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌తో స‌మావేశం అయిన అనంత‌రం పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పార్టీ మారే ముందు మంత్రి కేటీఆర్‌తో స‌మావేశ‌య్యారు విశ్వేశ్వ‌ర్ రెడ్డి.కేటీఆర్‌తో సమావేశమయ్యేందుకు విశ్వేశ్వర్ రెడ్డి తన రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని వెళ్లాడు. కానీ కేటీఆర్ విశ్వేశ్వర్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ విశ్వేశ్వర్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు. వచ్చే 15 నుండి 20 ఏళ్ల పాటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని స‌ముదాయించిన‌ట్లు తెలుస్తోంది.

మంగళవారం నాడు ఉదయం కూడ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని కేటీఆర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. ప్రచారానికి తాను దూరంగా ఉంటానని విశ్వేశ్వర్ రెడ్డి తేగేసి చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాతే విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మ‌రో తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు పార్టీకీ రాజీనామా చేశారు.

వికారాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు. వికారాబాద్ సీటు ద‌క్క‌క పోవ‌డంతో పార్టీనీ వీడారు. మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి తీరు న‌చ్చ‌నే వారు పార్టీ మారిన‌ట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ తరుఫున మెతుకు ఆనంద్‌ను బరిలో నిలిపింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంజీవరావు పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చంద్రశేఖర్‌కి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

విశ్వేశ్వరరెడ్డి బాటలోనే ఆయన కూడా నడుస్తారనే వార్తలు వినివిస్తున్నా.. ఆయన మాత్రం ఏపార్టీలో చేరబోయేది ఇంకా వెల్లడించాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పార్టీ నేతల వరుస రాజీనామాలతో గులాబీ దళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -