Friday, May 17, 2024
- Advertisement -

స‌ర్వేలో వైసీపీగురించి న‌మ్మ‌లేని నిజాలు…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఎదురు గాలి వీస్తోంది. అయితే ఇప్పుడు అదిరిపోయే షాకింగ్ లాంటి వార్త ఒక‌టి వెలుగు చూసింది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకీ ఎన్ని సీట్లు వ‌స్తాయో భాజాపా పుట్టిల్లుఅది కూడా తాను మిత్ర‌ప‌క్షంగా భావిస్తున్న బీజేపీ పుట్టిల్లు ఆర్ ఎస్ ఎస్ స‌ర్వే చేప‌ట్టింది. అయితే స‌ర్వేలో నివ్వెర‌పోయో నిజాలు వెలుగుచూశాయి.

2019లో అధికారంలోకి రావాల‌ని బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు లేవు. అయితే, ప‌రిస్థితి అంత వీజీ కాద‌ని, బాబుపై హ‌వా త‌గ్గుతోంద‌ని, ప్ర‌జ‌ల మూడ్ మారిపోతోంద‌ని, బాబు డ‌బ్బారాయుడు .. అనే కామెంట్లు వినిపిస్తున్నాయ‌ని తాజాగా ఆర్ ఎస్ ఎస్ తేల్చి చెప్పింది. దేశంలో ప్ర‌స్తుత మున్న ప‌రిస్థితిలో బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు అధికారంలోకి వ‌స్తాయా? రావా? అనే విష‌యంపై ఆర్ ఎస్ ఎస్ ఓ స‌ర్వే నిర్వ‌హించింది.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో గెలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే… అధికార టీడీపీ బొటాబొటి మెజార్టీ సాధించడమే కష్టమన్న అభిప్రాయం స‌ర్వేలో వెల్ల‌డైంద‌ని స‌మాచారం. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సాగిస్తోన్న అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని, దీన్ని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దృష్టి పెడితే.. ఆ పార్టీ గెలవడం ఖాయమనే వారు చెబుతున్నారట.

ప్రధాన ప్రతిపక్షం క్షేత్రస్థాయిలో బలహీనపడడం, జగన్‌ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం సగటు కార్యకర్తల్లో లేకపోవడం, ఆయనపై ఉన్న అవినీతి కేసులు.. ఇవన్నీ ఆ పార్టీకి ఆటంకాలు సృష్టిస్తాయనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.అధికార టీడీపీపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వేలో తేలిందట. మ‌రి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను వైసీపీ ఎలా ఉప‌యోగించుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -