- Advertisement -

సీఎం ర‌మేష్ పోట్ల దుర్తిలో కాపురం ఎలా చేస్తావో చూస్తా : వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి

- Advertisement -

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ చంద్ర‌బాబు నాయుడికి పార్టీలో ఉన్న గ్రూప్ త‌గాదాలు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. ఫిరాయింపులను ప్రోత్స‌హించిన బాబుకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో పార్టీ నేత‌ల మ‌ధ్య విబేధాలు బ‌గ్గుమంటున్నాయి. నేత‌ల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేంచుకు నానా తంటాలు పడుతున్నారు. అయినా విబేధాలు స‌మ‌సి పోవ‌డంలేదు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క వ‌ర్గంలో మంత్రి ఆది, రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య విబేధాలు మ‌రో సారి బ‌య‌ట ప‌డుతున్నాయి. ఇప్పుడుతాజాగా ప్రోద్దుటూరు నియోజ వ‌ర్గంలో పార్టీ నేత‌ల మ‌ధ్య త‌గాదాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ ను దెబ్బ తీయాలిని చూస్తున్న బాబుకు సొంత పార్టీలో నేత‌ల మ‌ధ్య ఉన్న విబేధాలు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి.

పార్టీ ఎంపీ ర‌మేష్‌, మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల రెడ్డి మ‌ధ్య విబేధాలు భ‌గ్గుమ‌న్నాయి. వ‌ర‌ద‌రాజుల రెడ్డి ర‌మేష్‌ను బండ‌బూతులు తిట్టారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌క‌లు నిధులు రాకుండా అడ్డుప‌డుతున్నార‌ని ఆరోపించారు. పోట్ల‌దుర్తిలో ఎలా కాపురం చేస్తావో చూస్తాన‌ని ర‌మేష్ ను హెచ్చ‌రించారు. ఇంకా డాస్‌…డాస్‌..బూతులు తిట్టారు. ఈ విష‌యం బాబు ద‌గ్గ‌ర‌కు వెల్లిందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -