Thursday, April 18, 2024
- Advertisement -

ఆ మూడు బిల్లులు జగన్ కోసమేనా ?

- Advertisement -

వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి పార్టీ పరంగాను, ప్రత్యర్థులపై వాడి వేడి విమర్శలు చేయడంలోను ఎప్పుడు ముందే ఉంటారు. ముఖ్యంగా ఆయన ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టడంలో చేసే వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హిట్ పెంచుతూ ఉంటాయి. కొన్ని రోజుల కిందట ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో కొడాలి నాని, పెర్ని నాని ముందు వరుసలో ఉండేవారు.. కానీ ఇప్పుడు వారు మౌనం పటిస్తుండడంతో ఆలోటును విజయ సాయి రెడ్డి భర్తీ చేస్తున్నారు. వైసీపీకి సి‌ఎం జగన్ కు అన్నీ విధాలుగా చేదోడు వాదోడుగా ఉండే విజయ సాయి రెడ్డి పార్లమెంట్ లో కూడా తనదైన రీతిలో స్పీచ్ లు ఇస్తూ ఉంటారు.

ఇక తాజాగా ఆయన పార్లమెంట్ లో మూడు బిల్లులు ప్రవేశ పెట్టారు. ఆయన ప్రవేశ పెట్టిన ఈ మూడు బిల్లులపై కూడా రకరకాల అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. ఆ మూడు బిల్లులు కూడా కేవలం జగన్ కోసమేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ అయిన ప్రవేశ పెట్టిన బిల్లులు ఏవంటే..మొదటి బిల్లు దేశంలో ఏదైనా రాష్ట్రానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాజధానులను ఏర్పాటు చేసే అధికారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెట్టేందుకు ఉద్దేశించిన బిల్లు.

ఇక రెండో బిల్లు విషయానికొస్తే.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులతో పాటు ఇతర రాజ్యాంగబద్ద ఎన్నికల్లో పాలుపంచుకునేలా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు బెయిల్ మంజూరు చేయాలనే బిల్.. ఇక మూడో బిల్ విషయానికొస్తే అసత్య వార్తలు ప్రచురించే మీడియా సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రెస్ కౌన్సిల్ కు సర్వాధికారాలు కట్టబెట్టాలని మూడవ బిల్లులో ప్రతిపాధించారు.. విజయ సాయి రెడ్డి ప్రతిపాధించిన ఈ మూడు బిల్లులలో ఏ ఒక్కటైన రాష్ట్రానికి ఉపయోగ పడేది ఉందా ? అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ మూడు బిల్లులు కేవలం వారి స్వార్థం కోసం ప్రవేశ పెట్టిన బిల్లులు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మండి పడుతున్నారు.

Also Read : జగన్ కు కుప్పంపై.. ఎందుకంత ప్రమ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -