Saturday, May 4, 2024
- Advertisement -

తెలంగాణ బీజేపీకి ఏమైంది?

- Advertisement -

ఈ నగరానికి ఏమైంది..ఓవైపు మూసి..మరోవైపు పొగ ఎవరూ మాట్లాడరేం అనే డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే సరిగ్గా తెలంగాణ బీజేపీకి వర్తిస్తుంది. కేంద్రంలో మోడీ సర్కార్‌…అధికారం మాదే…డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఉదరగొట్టారు.అంతే స్ధాయిలో ప్రచారాన్ని రక్తికట్టించారు. కానీ ఇదంతా రెండు నెలల క్రితం వరకు.

కానీ ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ఏమైంది…ఇప్పుడు ఇదే ప్రశ్న సగటు కార్యకర్తని వేధిస్తోంది. రెండు నెలల క్రితం వరకు ప్రజాక్షేత్రంలో యాక్టివ్‌గా ఉన్న నేతలంతా ఇప్పుడెక్కడ ఉన్నారు…?ఎందుకు నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి…మరోవైపు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ జెట్ స్పీడ్‌తో తమ కార్యచరణను వేగవంతం చేస్తుండగా బీజేపీ మాత్రం ఇంకా సైలెంట్ మోడ్‌లో నుండి బయటకు రాలేకపోతోంది. ఒకప్పుడు ఒక్కో నియోజకవర్గంలో తమకు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారని గొప్పలు చెప్పుకున్న నేతలంతా ఇప్పుడు కనీసం 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్క పేరు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌,ఈటల రాజేందర్,రఘునందన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్ధాయికి అసంతృప్తి చేరుకుంది. అందుకే ఈ నేతలంతా ఒకే వేదికపై కనిపించి చాలా నెలలే అవుతోంది. ఇక తాజాగా ఈటల వర్సెస్ కిషన్ రెడ్డికి మారిపోయింది బీజేపీ వ్యవహారం. అభ్యర్థుల ఎంపికలో ఈ ఇద్దరికి అసలు పడట్లేదట. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో నేతలు కూడా పార్టీ వైఖరితో విసిగిపోతున్నారట.

కొన్ని స్ధానాల్లో ఇప్పటికి ఆ పార్టీకి అభ్యర్ధలు లేరు. దీంతో పక్క పార్టీల నుండి వచ్చేవారికి టికెట్లు ఇద్దామని డిసైడ్ కాగా ఉన్న కొద్దివాట్లోనూ ఈటల తన వర్గం వారికోసం పట్టుబడితే కిషన్ రెడ్డి సైతం తన వర్గం వారికే టికెట్‌ అంటూ చెప్పుకుంటుండంతో ఎన్నికల సమరంలో వెనుకబడిపోతున్నారు. ఎన్నికలకు కేవలం మూడు నెలలే సమయం ఉండగా ఇప్పటికి ఆ పార్టీలో ఎలాంటి చలనం లేకపోవడంతో అసలు ప్రజల్లో బీజేపీ అనే పార్టీ ఉందా అనే స్ధాయికి చేరుకున్నారు. అసలే అభ్యర్థులు లేని పార్టీలో మళ్ళీ నేతల మద్య కోల్డ్ వార్ కొనసాగుతుండడంతో కమలం పార్టీ కథ కంచికే చేరేటట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులే కాదు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -