Wednesday, April 24, 2024
- Advertisement -

పవన్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా ?

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీ బలోపేతం కోసం గట్టిగానే ప్రయత్నిస్తూ ఆదిశగా ఫలితాలు కూడా సాధిస్తున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిగా ప్రజల్లోకి వెళ్ళేందుకు పవన్ సిద్దమైన సంగతి తెలిసిందే. పవన్ ప్రారంభించే ఈ యాత్ర జనసేనకు అత్యంత కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ ప్రారంభించి పదేళ్ళు అయిన ఇప్పటివరకు జనసేన ప్రభావం ప్రజల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కింగ్ మేకర్ పాత్ర పవన్ పోషించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా పొత్తుల విషయంలో మౌనం వహిస్తున్న పవన్..బిజెపి తో ఉన్న అంతర్గత పొత్తు అందరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ తో చేతులు కలిపేందుకు టిడిపి సిద్దంగానే ఉన్నప్పటికి పవన్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో సి‌ఎం పదవే టార్గెట్ అని పవన్ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పటికి పవన్ను సి‌ఎం అభ్యర్థిగా బాబు అంగీకరిస్తారా అంటే అది జరగని పని. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 స్థానాల్లో జనసేన గెలిచే విధంగా పవన్ టార్గెట్ పెట్టుకున్నట్లు వినికిడి. ఎందుకంటే కనీసం 30 స్థానాల్లో గెలవడం ద్వారా కింగ్ మేకర్ పాత్ర పవన్ పోషించే అవకాశం ఉంది.

అందువల్ల పొత్తుల్లో ఉన్న పార్టీల నుంచి సి‌ఎం అభ్యర్థిగా పవన్ నిలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జనసేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే నియోజిక వర్గాలలో మాత్రమే పవన్ ఫోకస్ చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేనకు అనుకూలంగా నిలిచే కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజిక వర్గాలపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి సి‌ఎం పదవే టార్గెట్ గా పవన్ చేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Also Read

బీజేపీ ” సినీ వ్యూహం ” ఎందుకో మరి !

కే‌సి‌ఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా !

జగన్ ఫ్లెక్సీ రాజకీయం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -