Monday, April 29, 2024
- Advertisement -

తెదేపా నాయకుల రాక్షసత్వం కనిపించడంలేదా? కులం కమ్మేసిందా?

- Advertisement -

హెలికాప్టర్ దిగే స్థలం కోసం అని ఎవరు చెప్పారు? కార్‌లో వచ్చిన కూడా గట్టిగా అరగంట సమయం పట్టని జర్నీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఏకంగా హెలికాప్టర్‌లో వచ్చారు. ఆ హెలికాప్టర్ దిగే సమయానికి అక్కడ ఆయనగారి సెక్యూరిటీ పర్సన్స్, టిడిపి నాయకులు అందరూ ఎంత మంది ఉంటారో ఈ మేధావులకు తెలియదా? వాళ్ళందరూ హెలిప్యాడ్ చుట్టుపక్కల పొలాల్లో ఉన్న పంటలను నిర్లక్ష్యంగా తొక్కుకుంటూ తిరిగేశారు. ఆయా తోటల్లో పండిన తినే పండ్లను తినేశారు. మందులోకి మంచింగ్‌గా వాడుకున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతును కొట్టారు. అదే విషయాన్ని ఆ రైతు ఆయన భార్యకు, కొడుక్కు కాల్ చేసి చెప్పాడు. ఆ తర్వాత ఆ రైతును ఇంకా రెచ్చిపోయి కొట్టారు. ఆ రైతు మరణం ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అని ఎన్ని వ్యూహాలు, ఎన్ని కుట్రలు పన్నాలో అన్నీ చేశారు. ఆ రైతు కుటుంబ సభ్యులు, ఆ ఊరి ప్రజలందరూ కూడా పూసగుచ్చినట్టుగా వివరాలన్నీ చెప్తున్నారు. ఏడుస్తున్నారు. అయితే వాళ్ళ ఏడుపు అరణ్యరోదనే అవుతోంది. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప టిడిపి అరాచకాలను ప్రశ్నించేవాడే ప్రస్తుతం ఆంధ్రనాట లేరు మరి. జనసేనుడు, వామపక్షాలతో పాటు సమైక్యాంధ్ర పోరాట యోధులు, మేధావులు, ప్రత్యేక హోదా యోధులు, శివాజీలాంటి వాళ్ళందరూ ఒక పార్టీ కోసం, ఒక కులం ప్రయోజనాల కోసం పుట్టుకొచ్చినవాళ్ళే మరి. ఇక మీడియావాళ్ళు కూడా సేం టు సేం.

ఇక చింతమనేని ప్రభాకర్ మాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముండా కొడకల్లారా అని చెప్పి ఆయన నోటి నుంచి వచ్చిన మాటల వీడియోను నారా లోకేష్ ట్విట్టర్‌లో షేర్ చేయడం, చింతమనేనిని సమర్థించడం, చంద్రబాబు కూడా చింతమనేని లాంటి మహాత్ముడిని విమర్శిస్తారా అంటూ మాట్లాడడం చూస్తే మనసు చివుక్కుమనని తెలుగువాడు ఉంటాడా? ఏ వ్యక్తి అయితేనేం? ఎ కులం, ప్రాంతం, దేశానికి చెందినవాడు అయితేనేం……….ఒక్క వక్తిని ముండాకొడుకు అంటేనే బాధగా ఉంటుంది. అలాంటిది ఏకంగా కొన్ని వర్గాలకు చెందిన కొట్లాది మంది ప్రజలను ముండాకొడకల్లారా అని ఒక నాయకుడు, ప్రజాప్రతినిధి తిడితే ఎవ్వరూ ఎందుకు నోరుమెదపడం లేదు?
ప్రజల కోసం పనిచేస్తున్నాం, హోదా కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం అని చెప్పుకుంటూ తిరిగే పవన్ కళ్యాణ్, రఘువీరాలాంటి నాయకులు, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లోక్ సత్తాలాంటి పార్టీలు, మేధావి సంఘాల వాళ్ళు, శివాజీలాంటి ఎవరికోసం పనిచేస్తున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోందా? చింతమనేనిని దురహంకారాన్ని కానీ, సామాన్య రైతు మరణాన్ని కానీ కనీసం ప్రశ్నించని వాళ్ళంతా ఏ పార్టీకి కొమ్ముకాస్తున్నారో? ఎవరి కమ్మని ప్రయోజనాల కోసం పనిచేస్తూ ప్యాకేజీలకు అమ్ముడుపోతున్నారో అర్థమవుతోందా అని నెటిజనులు అడిగే ప్రశ్నలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాధానం వెతకాలి. విభజనకు ముందు సమైక్యాంధ్రప్రదేశ్ అంటూ హంగామా చేసిన ఆరడుగుల బుల్లెట్ నాటకం, విభజన పాపంలో సమాన భాగం ఉన్న బిజెపిని హీరోని చేసిన వైనం, హోదా విషయంలో వెంకయ్యను వీరుడిగా చూపించిన వైనం, ఆ తర్వాత అందరూ టిడిపితో కలిసిన వైనం, అధికారంలోకి వచ్చాక ఐదేళ్ళుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడంతో పాటు, హోదా విషయంలో దగా చేసిన వైనం,ఇప్పుడు ఈ తాజా నాటకాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా తేల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ ప్రజలతోనే ఉంటూ ఇంచుమించు దశాబ్ధకాలంగా ప్రజల తరపున పోరాడుతున్న జగన్‌‌కి అండగా నిలబడాలా? లేక విభజనకు ముందు నుంచీ ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచీ కూడా ఒక కులానికి చెందిన కొంతమంది, కొన్ని మీడియా సంస్థలు ఒక నాయకుడిని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకుంటూ, ఆ నాయకుడిని హీరోగా చూపిస్తూ, విపరీత ప్రచారం చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం చేసిన పచ్చ బ్యాచ్‌కి మరోసారి అధికారం అప్పగించాలా? ముండా కొడకల్లారా అని తిట్టిన వీడియో కళ్ళ ముందు కనిపిస్తున్నా ముఖ్య నాయకుడి నుంచీ ఆ నాయకుడి వారసుడి వరకూ ఆ మాటలు తప్పే కాదు అని ప్రజలను మాయ చేయాలని చూడడం, పచ్చ మీడియా మొత్తం కూడా చింతమనేనినే హీరోని చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం……పవన్ కళ్యాణ్‌తో సహా ఏ ఒక్కరూ కూడా కనీసం ఒక్క విమర్శ కూడా చేయకుండా సైలెంట్‌గా ఉన్న వైనాన్ని చూస్తుంటే ఇంకోసారి అధికారంలోకి వస్తే మాత్రం ప్రజలెవ్వరికీ తెలియకుండా వాళ్ళ ధన, మాన, ప్రాణాలన్నీ కూడా దోచుకోగల సత్తా, సామర్థ్యం పచ్చ బ్యాచ్ సొంతం అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆవేధన వ్యక్తం చేశాడంటేనే ఆంధ్రప్రదేశ్‌నాట పరిస్థితి కళ్ళకు కడుతోంది. ఇక బాధ్యత అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల చేతుల్లోనే ఉంది అని ఆలోచనాపరులు ఆవేధనగా మాట్లాడుతూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -