Sunday, May 5, 2024
- Advertisement -

ఆదిలోనే కేసీఆర్‌కు ఎదురు దెబ్బ‌…? ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ సాధ్య‌మా….?

- Advertisement -

దేశ రాజ‌కీయాల్లో మార్పులు తీసుకురావాల‌ని తెలంగాణా సీఎం కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. భాజాపా, కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కొత్త కూట‌మి ఏర్పాటుకు కృషిచేస్తున్నారు. దీనిలో జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.

తాజాగా ఒడిషా సీఎంతోపాటు , ప‌శ్చిమ బెంగాళ్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో సామా వేశ మ‌య్యారు. ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై ఎలా స్పందించారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాళ్లు అటూఇటూగా ఉన్నట్టుగా అర్థమవుతోందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి

ఏడాది క్రితం ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తీసుకొచ్చిన కేసీఆర్.. వెంటనే కోల్‌కత వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. తొలిసారి భేటీ అనంతరం మీడియా ముందుకొచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఈ సారి భేటీ అనంతరం బయటకు వచ్చిన ఇద్దరు సీఎంలలో కేసీఆర్ మాత్రమే మీడియాతో మాట్లాడారు. మమత కనీసం ఒక్క మాటంటే.. ఒక్క మాట మాట్లాడలేదు.

చివరలో మాత్రం కేసిఆర్ చెప్పిన విషయాలతో తాను పూర్తి స్థాయిలో ఏకీభవించడం లేదన్నారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ప్రముఖ పాత్రను పోషించాలని మమతా బెనర్జీ తొలి నుంచీ కోరుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, అలాగని కాంగ్రెస్‌ను పూర్తిగా వ్యతిరేకించడం లేద‌ని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాద‌నే విష‌యాన్ని మ‌మ‌తా ప‌రోక్షంగా కేసీఆర్‌కు సంకేతాలిచ్చారు.

డిసెంబరు 10న కూడా చంద్రబాబు సారథ్యంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు నిర్వహించిన సమావేశానికి మమత హాజరయ్యారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లాలతో గత శుక్రవారం కోల్‌కతాలో ఆమెతో భేటీ అయ్యారు. అదే స‌మ‌యంలో సోనియాగాంధీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.

జనవరి 18న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్న మమత, అన్ని ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించారు. సోమవారం నాటి మౌనం కేసిఆర్ ఎజెండా మేరకు ముందుకు నడవడానికి సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. సుధీర్ఘ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, కొత్త రాష్ట్రంలో రెండుసార్లు ఒంటి చేత్తో టీఆర్ఎస్‌ను అధికారంలోకి తెచ్చిన లీడర్‌గా కేసీఆర్.. తనను తాను ఇప్పటికే నిరూపించుకున్నారు. అదే ఉత్సాహంతో దేశ రాజీకాయాల‌పై కూడా దృష్టి సారించారు.

ఆచితూచి స్పందించానలన్నట్టుగా ఉన్న నవీన్ పట్నాయక్, మమతల వైఖరిని చూస్తే.. కేసీఆర్ ఫ్రంట్‌ బలపడేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆదిలోనే అడ్డంకులు ఎదుర‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి కేసీఆర్ ప్రాంతీయ పార్టీల‌న్నింటినీ ఒకే తాటిమీద‌కు తెస్తారా లేదా అన్న‌ది భ‌విష్య‌త్తులో తేల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -