Friday, May 3, 2024
- Advertisement -

లోకేష్‌పై త‌మిళ దిన ప‌త్రిక సంచ‌ల‌న క‌థ‌నం…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ వార‌స‌త్వ కొన‌సాగించేందుకు లోకేష్‌ను ఎంత ఎలివేట్ చేస్తున్నా ఫ‌లితం క‌నిపించ‌డంలేదు. వారసత్వ రాజకీయాలు అనుసరిస్తూ చంద్రబాబు.. తన కుమారుడికి పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు. మొద‌ట్లో ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి లోకేష్‌ను దింప‌కుండా ఎమ్మెల్సీ ఇచ్చి మూడు శాఖ‌ల‌కు మంత్రిని చేశారు. దీంతో రాజకీయంగా నిల‌దొక్క‌కుంటాడ‌ని భావించ‌న బాబు ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో లోకేష్ మాట తీరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో లోకేష్ పోటీ చేయడానికి మంగ‌ళ‌గిరి సీటును సెట్ చేశారు బాబు. ఇంకే ముంది లోకేష్ అక్క‌డ‌నుంచి పోటీకి దిగారు. అయితే లోకేష్ విజ‌యంపై త‌మిళ దిన‌ప‌త్రిక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

మంగ‌ళ‌గిరి నియోజ‌క వ‌ర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ప్రాంతమని, ఇక్కడ గెలవడం అంత సులభం కాదని ఓట్లడిగేందుకు వెళ్లిన కొద్ది రోజులకే లోకేశ్‌కు తెలిసివచ్చింది. ప్రభుత్వం, అధికారం, ధనం, బలగం పూర్తిగా వినియోగించినా గట్టెక్కేలా లేడు. ఓడిపోతామా అనే భయం అతడిని ఆవరించి ఉంది’ అని ఆ కథనంలో పేర్కొంది. దీంతో లోకేష్ ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. సీఎం కొడుకుగా మొద‌టి ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందితే అది లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంలో ప‌డుతుంది. పార్టీ నాయ‌క‌త్వం లోకేష్‌పై న‌మ్మ‌క కోల్పోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -