Tuesday, April 23, 2024
- Advertisement -

బాబు ప్యూచ‌ర్‌ను డిసైడ్ చేయ‌నున్న టీ ఎన్నిక‌లేనా…? బాబుకు ద‌బిడి ..దిబిడేనా…?

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌లు టీఆర్ఎస్‌కు ఏమో గాని చంద్ర‌బాబు నాయుడికి మాత్రం మ‌ర‌ణ శాస‌నం కానున్నాయా..? ఎందుకు ఇంత శ్ర‌ద్ధ చూపుతున్నారు….? ఈ ఎన్నిక‌ల‌తోనే బాబు ప్యూచ‌ర్ ముడిప‌డి ఉందా…? అంటే అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి రాజ‌కీయ విశ్లేష‌కుల‌నుంచి. వంద‌ల కోట్లు ఖ‌ర్చు అయినా స‌రే తెలంగాణాలో మ‌హాకూట‌మి అధికారంలోకి రావాల‌ని బాబు భావిస్తున్నారు. బాబు ప్యూచ‌ర్‌ను ఈ ఎన్నిక‌లు డిసైడ్ చేయ‌నున్నాయా…?

తెంగాణా ఎన్నిక‌లు రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప్ర‌ధానం కానున్నాయి. అక్క‌డ వ‌చ్చే ఫ‌లితాల‌పైనే ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆధార ప‌డి ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీనీ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, జ‌న‌స‌మితి, సీపీఐ లు క‌ల‌సి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ఈ కూట‌మికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్ని చంద్ర‌బాబే అన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

మ‌హాకూట‌మి ఎన్నిక‌ల ఖ‌ర్చు అంతా కూడా చంద్ర‌బాబే భ‌రిస్తున్నార‌న్న వార్త‌లు బ‌హిరంగ ర‌మ‌స్య‌మే. వాస్త‌వంగా టీడీపీ అక్క‌డ పోటీ చేసిన సీట్లు త‌క్కువే అయినా ఇది బాబుకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. ఏపీలో పాల‌న‌ను గాలికొదిలి తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగి తేలుతున్నారు ఏపీ సీఎం. ప్ర‌జాకూట‌మి విజ‌యం పైనే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. ఇక్క‌డ స్విచ్ వేస్తే అక్క‌డ లైట్ వెలుగుతుంద‌ని ఒక సినిమాలో చెప్పిన‌ట్లు తెలంగాణా ఫ‌లితాలే బాబు జీవితాన్ని నిర్ధేసించ‌నున్నాయి.

ఇప్ప‌టికే తెలంగాణా ప్ర‌భుత్వ ప‌రిధిలో ఓటుకు నోటు కేసు మెడ‌పై క‌త్తిలా వేలాడుతునే ఉంది. ప్ర‌జాకూట‌మి అప‌జ‌యం పాలైతే బాబుపై వెంట‌నే కేసీఆర్ త‌న అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీస్తారు. అంతేకాదు ఈ ఎన్నిక‌ల్లో బాబు వంద‌ల‌కోట్లు డ‌బ్బులు ఖ‌ర్చుపెడుతున్నార‌ని గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. దానిలో భాగంగానే ఎన్నిక‌లు సంత్స‌రం ముందే వ్యూహాత్మ‌కంగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. తెలంగాణాలో కూట‌మి గెలిస్తే పాల‌న కీ అంతా బాబు చేతిలోకి వెళ్లిపోతుంద‌న‌డంలో సందేహంలేదు. అదే జ‌రిగితే బాబు ఓటుకు నోటు కేసునుంచి అధికారాన్ని ఉప‌యోగించుకొని త‌ప్పించుకోవ‌చ్చు.

కేవ‌లం 14 సీట్ల‌కు మాత్ర‌మే అంగీక‌రించ‌టంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల‌కు ఆర్ధిక స‌హాకారం అందించ‌టాన్ని బ‌ట్టే ఈ ఎన్నిక‌ల‌ను బాబు ఎంత ప్ర‌తిష్ట‌గా తీసుకుంటున్నారో అర్ధ‌మౌతుంది. ఇందుకు ద‌మ్మున్న మీడియా, స‌ర్వేల ల‌డ‌గ‌పాటి బాబుతో జ‌త‌క‌ట్టి మైండ్ గేమ్‌కు తెర‌తీసారు. ఏదో విధంగా తెలంగాణాలో గ‌ట్టెక్కాల‌ని ఏపీలో చేసిన విధంగా కుట్ర‌ల‌ను అమ‌లు చేస్తున్నారు.

ఒక‌వేళ ప్ర‌జాకూట‌మి ఓట‌మి చ‌విచూస్తే ఆ ప్ర‌భావం ఏపీలో త‌ప్ప‌క ప‌డుతుంది. అస‌లే అంతంత మాత్రంగా ఉన్న గ్రాఫ్ మ‌రింత దిగ‌జారుతుంది. అదే స‌మ‌యంలో వైసీపీ గ్రాఫ్ మ‌రింత పైపైకి పెరుగుతుంది. తెలంగాణా ప్ర‌జ‌లు మ‌హాకూట‌మిని తిర‌స్క‌రించార‌నే ప్ర‌భావం ఏపీ ప్ర‌జ‌ల‌పై కూడా ప‌డుతుంది. అది బాబు ప‌త‌నానికి నాంది అనే చెప్పాలి.

బీజేపీపై యుద్దం అంటూ రోజుకు ప్ర‌క‌ట‌న‌తో, ప్ర‌చార ఆర్బాట‌ల‌తో కాలం వెల్ల‌దీస్తున్న చంద్ర‌బాబు ఇక ముందుకు వెళ్లే ప‌రిస్థితి ఉండ‌దు. చంద్ర‌బాబు ఇప్పుడు ప‌ద్మ‌వ్యూహంలోకి అడుగుపెట్టాడు. ముందుకు పోవ‌టం త‌ప్పా వెన‌క్కు వ‌చ్చే ప‌రిస్థితి ఇక్క‌డ లేదు.

కుట్ర‌లతో, అవినీతితో, భ‌జ‌న‌మీడియా స‌హ‌కారంతో నెట్టుకొస్తున్న బాబు ప‌రిపాల‌న కు చ‌ర‌మ‌గీతం తెలంగాణా ఎన్నిక‌లే అన్న‌ది సుస్ప‌ష్టం ఏరకంగా చూసిన బాబుకు తెలంగాణా ఎన్నిక‌లు మ‌ర‌ణ‌శాస‌నంగా క‌నిపిస్తున్నాయి. మ‌రో వైపు ఏపీ ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుంటామ‌ని ఇప్ప‌టికే కీటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రాలో కూడా కేసీఆర్‌కు అభిమానులు చాలా మందే ఉన్నారు. బాబుకు వ్య‌తిరేకంగా ఏపీలో కేసీఆర్‌, కేటీఆర్ క‌లుగ జేసుకుంటే మాత్రం బాబుకు బామ‌ర్ధి డైలాగ్ ద‌బిడి …దిబిడే …..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -