Friday, May 10, 2024
- Advertisement -

ఆవేదనతోనే చంద్రబాబును కాల్చేయాలనిపిస్తోందన్నాను

- Advertisement -

నంద్యాల బహిరంగ సభలో చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాక‌ష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని లేపాయి.టీడీపీ నేత‌లు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు.జగన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు.జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులను జారీ చేసింది. ఈ నేఫథ్యంలో ఆయన మంగళవారం ఈసీకి వివరణ ఇచ్చారు

3 వ‌తేదీన వైసీపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో బాబుపై జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.తాను చేసిన వ్యాఖ్యలపై వైసిపి అధినేత వైయస్ జగన్ ఎన్నికల సంఘానికి మంగళవారం నాడు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశ్యం లేదని చెప్పారు.చంద్రబాబును నిలబెట్టి తుపాకీతో కాల్చేయాలనిపిస్తోందన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎన్నికల కమిషన్ ముందు వివరణ ఇచ్చారు.

2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా హామీలు ఇచ్చారని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా వాటిని పేర్కొన్నారని, అయితే ఆ హామీలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఆ ఆవేదనతోనే తాను నంద్యాల బహిరంగ సభలో అలా వ్యాఖ్యానించానని వివరణ ఇచ్చారు. మ‌రి ఈసీ సానుకూలంగా స్పందిస్తాదా అన్న‌ది వేచి చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -