Tuesday, April 23, 2024
- Advertisement -

అస‌లు జాతీయ పార్టీల‌కు సిగ్గుందా….?

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, జాతీయ పార్టీల‌పై నిప్పులు చెరిగారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా కూట‌ముల పేరుతో ఇత‌ర రాష్ట్రాలు తిరుగుతున్నార‌ని మండిప‌డ్డారు. భాజాపాతో విడాకులు తీసుకున్న త‌ర్వాత బ‌ద్ద‌శ‌త్రువైన కాంగ్రెస్‌తో క‌ల‌సి ఎన్డీఏకు వ్య‌తిరేకంగా కూట‌మి అంటూ బాబు జాతీయ పార్టీలు, ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌ను క‌లుస్తున్నారు.

ఇటీవలే కొత్తగా కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు పెళ్లి చేసుకుని మోడీపై యుద్దం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని… ఇదే చంద్రబాబు 2014కు ముందు కాంగ్రెస్‌ దేశానికి హాని అని చెప్పి…. ఇప్పుడేమో కాంగ్రెస్‌ వల్లే దేశానికి రక్షణ అంటున్నారని జ‌గ‌న్ గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్‌ అవినీతి కొండ అని చెప్పి…. ఇప్పుడు కాంగ్రెస్‌ ఆనంద కొండ అంటున్నారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీ మొద్దబ్బాయి అన్నారని…. ఇప్పుడు మాత్రం రాహుల్‌ మేధావి అని చంద్రబాబు అంటూ కీర్తి స్తున్నార‌ని ఎద్దేవ చేశారు.

2014లో జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే అని చెప్పిన చంద్రబాబు…. ఇప్పుడు జగన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్ప‌టికే యూపీఏ కూట‌మిలో ఉన్న పార్టీల‌ను క‌లుస్తూ నేనే భాజాపాకు వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల‌ను ఏక‌తాటి మీద‌కు తీసుకొస్తున్నాని చెప్తూ బిల్డ‌ప్ ఇచ్చుకుంటున్నార‌ని ఎద్దేవ చేశారు.

చంద్రబాబు పిలిస్తే ధర్మపోరాట దీక్షకు గంగిరెద్దుల్లా త‌లూపుతూ వ‌స్తున్నార‌ని…23 మంది ఎమ్మెల్యేల‌ను సంతో ప‌శువుల్లాగా కొనుగోలు చేసిన విష‌యం ద‌ర్మ‌మో కాదో ముందు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎకంగా న‌లుగురు ఫిరాయింపు నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన ఘ‌నుడు బాబ‌న్నారు.

ప్రత్యేక విమానాలేసుకుని అన్ని రాష్ట్రాలకు వెళ్లి ముఖ్యమంత్రులను కలుస్తూ రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు… పక్కనే ఉన్న ఒడిషాకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఝంజావతి ప్రాజెక్టు గురించి మాత్రం మాట్లాడే సమయం లేదా అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -