Sunday, May 5, 2024
- Advertisement -

పోటీకీ బ‌ల‌మైన అభ్య‌ర్త‌ల ఎంపిక‌లో క‌స‌ర‌త్తు చేస్తున్న జ‌గ‌న్‌..

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో కూడా రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్యనువ్వా నేనా అన్న‌ట్లు రాజ‌కీయం సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌లు ఇరు పార్టీల‌కు ప్ర‌తీష్టాత్మ‌కంగా మారాయి. మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని బాబు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటే…అదే అధికారంకోసం జ‌గ‌న్‌కూడా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ, చీటికి మాటికి ప్ర‌తిప‌క్షాన్ని ఇరుకున పెట్టే నాయ‌కుల‌ను జ‌గ‌న్ టార్గెట్ చేయ‌బోతున్నారు. జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తూ వైసీపికి కొర‌క‌రాని కొయ్య‌లుగా ప‌రిణ‌మించిన ఆ న‌లుగురు టీడిపి నేత‌ల ఓట‌మి కోసం జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రచిస్తున్న‌ట్టు స‌మాచారం

అధికారం చేప‌ట్టాలంటే ఉభ‌య గోదావిరి జిల్లాల్లో వ‌చ్చే సీట్ల‌పైనే ఆధార‌ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆనులుగురిని ఎలాగైనా ఓడించాల‌ని టార్గెట్‌గా పెట్టుకున్నారంట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ బాబునే టార్గెట్ చేసిన జ‌గ‌న్ ఇక‌నుంచి ఆ నులుగురిని టార్గెట్ చేసుకోనున్నారంట‌.

మంత్రులు కె.అచ్చెంనాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వర రావులతో పాటు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీ‌నివాస‌రావుని ఏ విధంగానైనా ఓడించాలని జగన్‌ నిశ్చయించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్నా ఆనులుగురికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చెక్ పెట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వారిపై పోటీకీ గ‌ట్టి అభ్య‌ర్తుల‌ను ఎంపిక చేసే ప‌నిలో బిజీగా ఉన్నారంట‌. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు నియోజకవర్గంలో ఆయనకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థులు రంగంలో ఉండడంతో అచ్చెంనాయుడు, అయ్యన్నపాత్రుడు స్వల్ప తేడాతో ఓటమి చెందారు. దేవినేని ఓడించేందుకు బలమైన నేత అయిన వసంతను జగన్ ఇప్ప‌టికే ఎంపిక చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -