Saturday, April 27, 2024
- Advertisement -

అయ్యన్న అరెస్ట్.. రాజకీయ వ్యూహమేనా ?

- Advertisement -

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. నర్సిపట్నం ఇంటిగోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని ఆయన మీద అభియోగం రావడంతో పొలిటీసులు నోటీసులిచ్చి అరెస్ట్ చేశారు. అయ్యన్నపాత్రుడుతో పాటు ఆయన కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అయ్యన్న అరెస్ట్ ను టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

అయ్యన్నపాత్రుడిని కక్ష్య పూరితంగానే అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో అయ్యన్నది ప్రత్యేక శైలి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తుంటారు అయ్యన్నపాత్రుడు. దాంతో అయ్యన్నపాత్రుడిని కక్ష్య పూరితంగానే జగన్ సర్కార్ అరెస్ట్ చేసిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇక అయ్యన్న అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. దొంగల్లా పోలీసులు ఇళ్లపై పడి అరెస్ట్ చేయడం ఎప్పుడైనా చూశారా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ దోపిడిని ప్రశ్నించినందుకే అయ్యన్నను అరెస్టు చేశారంటూ ఆయన ఆరోపించారు.

వైసీపీ అధికరంలోకి వచ్చినది మొదలుకొని అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని, ఇప్పటికే 10కి పైగా కేసులను అయ్యన్న కుటుంబంపై మోపారని చంద్రబాబు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సి‌ఎం లా కాకుండా రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇడుపులపాయలో వందల ఎకరాలను వైఎస్ కుటుంబం ఆక్రమించిందని, కేవలం 2 సెంట్ల భూవివాదంలో వచ్చిన ఆరోపణలను బట్టి అయ్యన్నను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని, వైఎస్ కుటుంబ అక్రమాలపై తాము ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏది ఏమైనప్పటికి అయ్యన్నపాత్రుడి అరెస్ట్ వెనుక జగన్ సర్కార్ రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. మరి టీడీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -