Sunday, May 12, 2024
- Advertisement -

త‌దుప‌రి కార్య‌చ‌ర‌న‌పై అయోమ‌యంలో జ‌గ‌న్‌…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌ల‌పెట్టిన అన్న వ‌స్తున్నాడు పాద‌యాత్ర‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. పాద‌యాత్ర చేస్తాడాలేదా వాయిదా వేసుకుంటాడ‌నె వార్త‌లు ఇప్ప‌డు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. అక్టోబర్ 27 నుంచీ అట్టహాసం గా జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు అయితే ఇది వాయిదా పడే సూచనలు కనపడుతున్నాయి. అయితే దీని వెనుక బ‌ల‌మైన కార‌నాలె క‌నిపిస్తున్నాయి.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోడానికి పాద‌యాత్ర చేస్తున్నాన‌ని సీబీఐ కోర్టుకు హాజ‌ర‌య్యే విష‌యంలో త‌న‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశారు జ‌న‌గ్. దీనిపై స్పందించిన కోర్టు ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు హాజ‌ర‌వ్వాల్సిందేన‌ని తీర్పు వెల్ల‌డించింది. దీంతో మ‌రోసారి సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. కోర్ట్ ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి జగన్ ని మినహాయించడానికి తిరస్కరించిన దరిమిలా పాదయాత్ర ని ఎలా కొనసాగించాలనేది ప్రశ్నగా మారింది.

అందులోనూ పాద‌యాత్ర ప్రారంభమే శుక్రవారం పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా తేదీ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ముహూర్త బలం లేకనే ఆ డేట్ ని మారుస్తున్నట్టు వైకాపా లో ఇప్పటికే న్యూస్ పుట్టింద‌నె వార్త వైర‌ల్‌గా మారింది.
మ‌రో వైపు వైఎస్ఆర్ కుటుంబానికి స్పంద‌న స‌రిగా రావ‌డంలేద‌నెవార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వైఎస్ఆర్ కుటుంబానికి నామమాత్రపు స్పందన లభించింది. అంతేకాదు రాష్ట్రంలో టిడిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు వైఎస్ఆర్ కుటుంబం వారధిగా పనిచేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. అయితే వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి సంబంధించిన సమీక్షలో వైఎస్ఆర్‌సిపీ అధినేత జగన్ షాక్‌కు గురయ్యారు. ఈ కార్యక్రమానికి నామమాత్రపు స్పందన రావడం పట్ల ఆయన పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

మిగిలిన అన్ని జిల్లాల్లో నామామాత్రంగానె స‌భ్య‌త్వ న‌మోద‌య్యింద‌ని గుణాంకాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోకూడా స‌భ్య‌త్వం త‌క్కువ‌గా కావ‌డంతో జ‌గ‌న్ అసంతృప్తిగా ఉన్నారంట‌. దీంతోనె పాద‌యాత్ర వాయిదా వేయాల‌ని నాయ‌కుల‌నుంచి జ‌గ‌న్‌కు విజ్ణ‌ప్తులు వెల్తున్నాయి. అయితె ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై పార్టీ క్లారిటి ఇవ్వ‌లేదు. అందుకె జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను వాయిదా వేస్తున్న‌ర‌నె వార్త‌ల‌లో ఎంత నిజం ఉందో మున్ముందు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -