సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ అభిమానుల మధ్య వార్ ముదురి పాకాన పడుతోంది. చివరకు పోలీస్టే షన్‌లో ఒకరు మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి యామిని శర్మ, వైసీపీ అభిమానుల మధ్య గత నాలుగు రోజులుగా పోస్ట్ ల యుద్ధం జరుగుతోంది. ప్రధాని మోదీ తిరుపతి రాక సందర్భంగా యామిని జగన్ పై వాడు…వీడు అని కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు తీవ్రస్థాయిలో స్పందించారు.
తన పేరు మీద అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతూ అవమానిస్తున్నారని యామిని శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తమ కుటుంబంమీద ట్రోలింగ్ ఎక్కువ అయ్యిందని..యామిని పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తన ఫోటో, టీడీపీ అధినేత చంద్రబాబు , లోకేశ్, ఎన్టీఆర్ ఫొటోలు పెట్టి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై గతంలో రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేసినా అసభ్యకర పోస్టులు ఆగలేగడం లేదని తెలిపారు.
ఏపీ సీఎం YS జగన్మోహన్ రెడ్డి, ప్రధాన మంత్రి మోదీ ఫొటోలతో అసభ్యకరంగా పోస్టులు పెట్టి, తనకు అపవాదు తెస్తున్నారని వాపోయారు. ఇక, తన ఫోన్ నెంబర్, తన భర్త ఫోన్ నంబర్ సేకరించిన గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇదలా ఉంటెయామినిపై వైసీపీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ ని కించపరుస్తూ ఫేస్ బుక్ పోస్ట్ చేశారని ఆరోపిస్తూ గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేసింది. మరోపక్క, సామాజిక మాధ్యమాల వేదికగా తన పేరిట ఫేక్ పోస్టింగ్స్ వస్తున్నాయంటూ సాధినేని యామిని ఏపీ పోలీసులకు ఈరోజు ఫిర్యాదు చేసిన విషయం. యామిని కేసుపెట్టిన కొద్ది గంటలు గడవకు ముందే వైసీపీ మహిళా విభాగం కూడా కేసు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
