Sunday, May 12, 2024
- Advertisement -

ప్ర‌పంచంలో అతి త‌క్కువ ధ‌ర ఇల్లు

- Advertisement -

ఇల్లు కట్టలన్నా.. కొనాలన్న లక్షలు.. కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. పట్టణాలు .. నగరాల్లో అయితే వాటి ధర ఆకాశాన్ని అంటుతాయి. అందుకే వీలైనంత తక్కువ ధర పలికే స్థలాన్ని ఇంటిని వెతికి కొనుగోలు చేస్తుంటారు.సామాన్య‌,పేద ప్ర‌జ‌లు అయితె వారి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక సెలబ్రటీలు నివసించిన ఇళ్లయితే దాని విలువ వెలకట్టడానికి వీలు లేకుండా ఉంటుంది.

ప్ర‌స్తుతం ఇల్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి.కానీ అమెరికా న్యూజెర్సీ నగరంలోని ఓ పురాతన విలాసవంతమైన భవనాన్ని అత్యంత చవక ధరకు అమ్మకానికి పెట్టారు. ధర కేవలం పది డాలర్లే, అంటే మన కరెన్సీలో 637 రూపాయలు మాత్రమే.

దాని ధర వింటే ఇంత చవకగానా? అని ఆశ్చర్యపోతారు. ఇప్పుడే కొనేస్తామంటారు. కానీ కొనడానికి కొన్ని షరుతులున్నాయి. అవి తెలుసుకుంటే ముక్కున వేలేసుకుంటారు.కాస్త ఆలోచించి కొనాలి.

న్యూజెర్సీ మౌంట్‌క్లెయిర్‌లోని స్థానిక హౌసింగ్‌ సోసైటీ లేఅవుట్‌ వేసి అభివృద్ధి చేయాలని ఫ్రభుత్వం భావించింది. అయితే.. అక్కడే 1906లో ప్రముఖ ఆర్కిటెక్చర్‌ డుడ్లే వ్యాన్‌ అంట్రెప్‌ నిర్మించిన ఇల్లు ఉంది. అందులో తొలి అమెరికన్‌-ఆఫ్రికన్‌ పుట్ బాల్ ప్లేయర్ అబ్రే లూయిస్‌ నివసించేవాడు. ఇలా వందేళ్ల చరిత్రగల ఆరు పడక గదులు గల ఈ ఇంటిని ధ్వంసం చేయకుండా అమ్మకానికి పెట్టింది స్థానిక ప్రభుత్వం. కానీ ఇంటి ధరను కేవలం 10 డాలర్లుగా నిర్ణయించింది.

10 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేసిన యాజమాని, ఆ ఇంటిని అమాంతం అక్కడి నుంచి మరో చోటుకి తరలించాల్సి ఉంటుంది. అందుకయ్యే ఖర్చు కొనుగోలుదారే భరించాలి. పురాతన చారిత్రక భవనాన్ని అధునీకత పేరుతో కూల్చడం సరికాదని భావించిన అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే కొనుకున్న యజమాని కూడా ఇంటిని ధ్వంసం చేయరాదనే షరతును పెట్టింది అక్కడి ప్రభుత్వం. మ‌రి ఇప్పుడు ఇంటిని కొనె స‌హాసం చేస్తారా…ట్రై చేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -