Wednesday, April 17, 2024
- Advertisement -

వైకాపాకు 142 సీట్లు ఖాయం……. మార్జిన్‌లో మరో 12…. సరికొత్త సర్వే

- Advertisement -

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? చంద్రబాబు, జగన్‌లలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అనే విషయంపై పూర్తి స్పష్టత వస్తూ ఉంది. చంద్రబాబుకే మళ్ళీ అధికారం అప్పగించడానికి ప్రజలు రెడీగా ఉన్నారా? లేక జగన్‌కి ఒక అవకాశం ఇద్దాం అని ఆలోచిస్తున్నారా? అనే విషయంలో ఇప్పుడు మరో సర్వేలో సరికొత్త నిజాలు బయటపడ్డాయి. తెలుగు మీడియాలో అత్యంత ప్రముఖుల్లో ఒకరైన సీనియర్ ఎడిటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

2019 ఎన్నికల్లో వైకాపా ఖాతాలో 142 సీట్లు ఖాయంగా పడనున్నాయి. మరో 12 సీట్లు వెయ్యి, రెండు వేల మార్జిన్ ఓట్ల తేడాతో డిసైడ్ అవ్వనున్నాయి. ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి ఈ 12 సీట్లలో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అయితే 142 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మాత్రం దాదాపు ఐదు-పది వేలను మించిన ఓట్ల మార్జిన్‌తో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టిడిపి కంటే ఐదు శాతం ఎక్కువ మంది వైకాపాను గెలిస్తామని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా కంటే టిడిపి అటూ ఇటూగా కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చింది. ఈ సారి వైకాపా దాదాపు ఐదు శాతం ఓట్లను మించిన తేడాతో అధికారంలోకి రానుంది. ఇక ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పనితీరుపై వ్యతిరేకత కనబరిచారు. అన్నింటికీ మించి ఏ ఒక్క విషయంలోనూ చంద్రబాబును నమ్మలేమన్న అభిప్రాయాన్ని ఎక్కువమంది వ్యక్తపరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శైలిలోనే జగన్ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాడన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నారు.

ఈ సర్వే ఫలితాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. ప్రస్తుతం రాజకీయ సర్కిల్‌లో ఇవి హాట్ టాపిక్ అయ్యాయి. ఒకటి రెండు శాతం మార్జిన్ జగన్‌కి ఉన్నప్పటికీ రాజకీయ వ్యూహాలు, మేనేజ్‌మెంట్ తెలివితేటలతో టిడిపిని గెలిపించగల శక్తి చంద్రబాబుకు, ఆయన భజన మీడియాకు ఉందని టిడిపి నాయకులు, శ్రేణులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా టిడిపికంటే వైకాపాకు ఐదు శాతం ఓట్లు ఎక్కువ పడనున్నాయన్న విషయం తెలియడంతో టిడిపి నాయకుల్లో కూడా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు అన్న నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -